నేను ఓడితే మార్కెట్లు ఢమాల్..గెలిస్తే జిగేల్!

నేను ఓడితే మార్కెట్లు ఢమాల్..గెలిస్తే జిగేల్!

న్యూఢిల్లీ : ఇండియాతో ట్రేడ్‌‌‌‌ డీల్ ఈ ఏడాది చివరకి జరిగే అవకాశాలున్నాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్యామిలీతో కలిసి ఇండియా వచ్చిన ట్రంప్ మంగళవారం న్యూఢిల్లీలోని అమెరికన్ ఎంబసీలో బిజినెస్ లీడర్లతో సమావేశమయ్యారు. ‘కోవిడ్ ఎఫెక్ట్‌‌‌‌తో సోమవారం ఒక్కరోజే మార్కెట్లు పడిపోయాయి. ఒకవేళ అమెరికా ఎన్నికల్లో నేను ఓడిపోతే కనుక ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా దారుణంగా మార్కెట్లు క్రాష్ అవుతాయి. నేను గెలిస్తే మార్కెట్లు పెరుగుతాయి’ అని అన్నారు ట్రంప్​. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ, మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా నుంచి ఓయో రూమ్స్ ఫౌండర్ రితేష్ అగర్వాల్ వరకున్న బిజినెస్ లీడర్లందరూ ట్రంప్ భేటీకి హాజరయ్యారు.

ఇండియా గొప్ప మార్కెట్

  • ఇండియా గొప్ప మార్కెట్​. ఇక్కడ ఉండి మాట్లాడటం చాలా గర్వంగా ఉంది.
  • మీ  ప్రధానమంత్రి మోడీ చాలా స్పెషల్​.
  • ఆయన చేస్తున్నదేమిటో ఆయనకు తెలుసు. చాలా అద్భుతమైన జాబ్‌‌ను మోడీ నిర్వహిస్తున్నారు.
  • మేము కలిసి చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాం.
  • అమెరికాలో వ్యాపారాలకు చాలా రెగ్యులేషన్స్‌‌ను మేము తగ్గించాలనుకుంటున్నాం. రెగ్యులేషన్స్‌‌లో కొన్నింటిని చట్టపరమైన ప్రాసెస్ ద్వారానే మార్చాల్సి ఉంటుంది.
  • ఇండియా 300 కోట్ల డాలర్ల విలువైన హెలికాప్టర్లను కొనుగోలు చేస్తోంది..
  • వచ్చే 50 లేదా 100 ఏళ్లలో ఇండియా మేజర్ ప్లేయర్‌‌‌‌గా మారనుంది..
  • మేము ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం.. ఆయన (మోడీ) అమెరికాలో ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు
  • మా ఉత్పత్తులపై ప్రపంచంలో  అత్యధిక టారిఫ్‌‌లు విధిస్తున్న దేశం ఇండియానే.

కోవిడ్​తో పోరాటానికి 250 కోట్ల డాలర్లు

  • కోవిడ్ వైరస్‌‌ను తగ్గించడానికి చైనా చాలా కష్టపడుతోంది. ప్రెసిడెంట్ జిన్‌‌పింగ్‌‌తో నేను మాట్లాడా. దీన్ని మరింత కంట్రోల్ చేయాల్సి ఉంది
  • కోవిడ్‌‌ వైరస్ విషయంలో అమెరికా కాస్త ఫర్వాలేదు.. ఈ వైరస్‌‌ తో పోరాడేందుకు అమెరికా 250 కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు ప్లాన్ చేస్తోంది..
  • కోవిడ్ ఎఫెక్ట్‌‌ అమెరికాలో కంట్రోల్‌‌లోనే ఉంది. ఇతర దేశాలతో అమెరికా వ్యాపారం చేస్తోంది. ఇతర దేశాలు ఆరోగ్యకరంగా, మంచిగా ఉండాలని మేము కోరుకుంటాం.
  • కిందటేడాది చివరన చైనాలో ఈ కోవిడ్ వైరస్ బ్రేకౌట్ అయింది. అప్పటి నుంచి సోమవారం నాటికి ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారు 2,592 మంది కాక, మొత్తంగా నమోదైన కేసులు 77 వేలకు పెరిగాయి.
  • అమెరికా–ఇండియా మధ్య ట్రేడ్ 500 బిలియన్ డాలర్లను రీచ్ అవ్వాలని సీఐఐ, అమెరికా బిజినెస్ కౌన్సిల్ టార్గెట్‌గా పెట్టుకున్నాయి.
  • కామర్స్‌ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం 2018–19లో యూఎస్‌–ఇండియాల మధ్య వాణిజ్యం 87.95 బిలియన్‌ డాలర్లకు చేరింది.