- సెలెక్ట్ చేసిన ప్రెసిడెంట్ ట్రంప్
- సెనేట్ ఆమోదిస్తే మేలో పదవీ స్వీకారం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మాజీ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను సెంట్రల్ బ్యాంక్ కొత్త చైర్మన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుత చైర్మన్ జెరోమ్ పావెల్ పదవీ కాలం మేలో ముగియనుంది. “కెవిన్ వార్ష్‌ను ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా నామినేట్ చేస్తున్నాను” అని ట్రూత్ సోషియల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. సెనేట్ ఆమోదిస్తే వార్ష్ ఫెడ్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఆయన హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఫెలోగా, స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ట్రంప్ ప్రకటనతో ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్, బ్లాక్‌రాక్‌కి చెందిన రిక్ రీడర్, ట్రంప్ టాప్ ఎకనామిస్ట్ కెవిన్ హాసెట్, కెవిన్ వార్ష్ మధ్య కొనసాగిన పోటీ ముగిసింది.
