అమెరికాది ఆగం ప‌రిస్థితి

అమెరికాది ఆగం ప‌రిస్థితి

అమెరికాలో కొద్ది రోజుల్లో దారుణ ప‌రిస్థితి రాబోయే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఆ దేశ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్. క‌ష్ట ప‌రిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ సిద్ధంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా అమెరికా దేశ ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పారు ట్రంప్. క‌రోనాకు ఇప్ప‌టికిప్పుడు మందు త‌యార‌య్యేలా క‌నిపించ‌డంలేద‌ని..కాబ‌ట్టి జాగ్ర‌త్త‌లు పాటించ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని తెలిపారు.

క‌రోనా నుంచి త‌ప్పించుకోవాలంటే ఎవ్వ‌రికివారు త‌ప్ప‌నిస‌రిగా కేర్ తీసుకోవాల్సిందేన‌ని చెప్పారు ట్రంప్. ఇప్ప‌టికే అమెరికాలో క‌రోన బాధితుల సంఖ్య ఆల్మోస్ట్ 2 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో ఉండ‌గా.. 3 వేల 896 చ‌నిపోయిన విష‌యం తెలిసిందే.