వాషింగ్టన్: అమెరికాతో కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ గేమ్స్ ఆడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. అమెరికాను చూసి నవ్వుతోందని, త్వరలోనే ఆ నవ్వులకు ముగింపు పలుకుతామని ఆయన స్పష్టం చేశారు. ‘అమెరికాతో పాటు మిగతా ప్రపంచంతోనూ గత 47 ఏళ్లుగా ఇరాన్ ఆటలాడుతోంది’ అని ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ వేదికపై పేర్కొన్నారు.
ఇప్పుడు మళ్ళీ గొప్పగా మారిన అమెరికాను చూసి ఇరాన్ నవ్వుతోందని ఆయన ఆరోపించారు. అయితే, ‘వారు ఇకపై నవ్వుకోలేరు!’ అని హెచ్చరించారు. అయితే, అమెరికా పంపిన తాజా శాంతి ప్రతిపాదనపై ఇరాన్ ఆదివారం స్పందించిందన్న వార్తలపై మాత్రం ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
