బాయ్‌ఫ్రెండ్‌ ను పెళ్లాడిన ట్రంప్ కూతురు

బాయ్‌ఫ్రెండ్‌  ను పెళ్లాడిన ట్రంప్ కూతురు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ తన బాయ్‌ఫ్రెండ్‌  ను మైఖెల్‌ బౌలస్‌ను పెళ్లాడింది.  నాలుగేళ్ల ప్రేమాయాణం అనంతరం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడింది. ట్రంప్‌కు చెందిన మార్‌ ఎ లాగో రిసార్ట్‌లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అమెరికా టైమ్ ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటలకు వివాహం జరిగింది. ట్రంప్ దగ్గరుండి ఈ పెళ్లిని జరిపించారు. వధువు టిఫానీని వెంటబెట్టుకుని వివాహ మండపానికి తీసుకువచ్చారు. 

ఈ వివాహనికి ట్రంప్  ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు.  ట్రంప్‌ రెండో భార్య, నటి మార్ల మాపుల్స్‌ ఏకైక కూతురే టిఫానీ. 1993లో మర్లను ట్రంప్‌ వివాహమాడగా 1999 వరకు వీరు భార్యభర్తలుగా కొనసాగారు. అనంతరం విడాకులు తీసుకున్నారు. అనంతరం మెలానియాను ట్రంప్‌ వివాహమాడారు.