
ఆదివారం జరిగే గ్రూప్ 1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4.03 లక్షల మంది అటెండ్ కానుండగా, వీరికోసం 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు అటెండ్ కానుండగా, వీరికోసం 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు.
పరీక్షా కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ ను నియమించగా, 3 నుంచి 5 సెంటర్లను తనిఖీ చేసేలా ఫ్లయింగ్స్ స్క్వాడ్స్ టీములను ఏర్పాటు చేశారు. నిర్ణీత సమాయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరు. అభ్యర్థులు ఏ4 సైజ్ పేపర్ పై లేజర్ కలర్ ప్రింట్ తో హాల్ టికెట్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దానిపై మూడు నెలలలోపే తీసిన ఫొటోను అతికించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.