తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి భక్తులను అనుమతించకుండా ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. కరోనా  ఉద్ధృతి తగ్గడంతో రెండేళ్ల తర్వాత తిరిగి భక్తులకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ , మే, జూన్  నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20 వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ వెబ్ సైట్ తో ఆర్జిత సేవా టిక్కెట్లు బుక్ చేసుకోవ చ్చని తెలిపింది. 

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజ పాద దర్శనం వంటి ఆర్జిత సేవ టికెట్లను ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా భక్తులకు టీటీడీ కేటాయించనుంది. ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ ఆర్జిత సేవ టికెట్లను ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మొదటిగా బుక్ చేసుకున్న వారికి మొదటిగా (FIFO పద్ధతిన) కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

ఢిల్లీలో వైన్ షాపులు ఓపెన్

2022లో మొదటి తుపాన్‌‌‌‌‌‌‌‌ అసానీ