తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాజకీయం మరింత వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్షాలు ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ పేరు మాత్రం నిత్యం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అటు రాజకీయాలు, ఇటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చోటు చేసుకుంటున్న ఆసక్తికర పరిణామాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
ఆ ఫోటో చూసి భావోద్వేగం!
లేటెస్ట్ గా విజయ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా అభిమానులను కలుస్తున్న సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒక యువ అభిమాని విజయ్ కోసం ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్ చేసిన ఫోటోను తీసుకొచ్చాడు. అందులో దివంగత నటుడు, -రాజకీయ నాయకుడు విజయకాంత్, చిన్న వయసులో ఉన్న విజయ్ చేతిని పట్టుకుని ఉన్నారు. అదే ఫోటోలో పెళ్లికూతురు గెటప్‌లో విజయ్ భార్య సంగీత కూడా ఉండటం విశేషం.
అయితే వందలాది మంది అభిమానులు ఫోటోలతో వేచి ఉన్నా, విజయ్ కన్ను మాత్రం ఈ నిర్దిష్ట ఫోటోపై పడింది. వెంటనే తన సెక్యూరిటీని పిలిచి ఆ ఫోటోను తీసుకోవాలని కోరారు. ఆ ఫోటోను అందుకున్న విజయ్, కాసేపు దానిని తదేకంగా చూస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆపై తన టీమ్‌కు దానిని జాగ్రత్తగా భద్రపరచమని చెప్పి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానుల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. కొందరు విజయ్‌కి భార్యపై ఉన్న ప్రేమే ఇందుకు కారణమని అంటుంటే.. మరికొందరు తన గురువు లాంటి విజయకాంత్ ఫోటో ఉండటం వల్ల ఆయన స్పందించారని అభిప్రాయపడుతున్నారు.
వివాదాలు – విడాకులు..
విజయ్ వ్యక్తిగత జీవితం గత ఏడాది కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఆ పిటిషన్‌లో ఆమె విజయ్‌పై సంచలన ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, 2021 నుండి కుటుంబానికి దూరంగా ఉంటున్నారని ఆమె ఆరోపించినట్లు ప్రచారం సాగుతోంది. దీనికి తోడు, ఇటీవల విజయ్, నటి త్రిష ఒకే రకమైన దుస్తుల్లో ఒక వివాహ వేడుకకు హాజరుకావడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. అయితే ఈ విడాకుల వార్తలపై ఇప్పటివరకు విజయ్, సంగీత అధికారికంగా స్పందించలేదు..
'జననాయకన్' వాయిదా..
పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో విజయ్ నటించిని చివరి చిత్రం 'జననాయకన్' (Jana Nayagan). అయితే జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ బోర్డు , కోర్డు వివాదాలతో వాయిదా పడింది. దీనికి తోడు ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. వీటన్నింటి వెనుక తన రాజకీయ ప్రత్యర్థుల కుట్ర ఉందని విజయ్ ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనా, అటు వ్యక్తిగత జీవితంలో తుపానులు, ఇటు రాజకీయాల్లో సవాళ్లు ఎదుర్కొంటూ విజయ్ ఎలా ముందుకు సాగుతారనేది ఇప్పుడు కోలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడు ఎన్నికల వేళ ఈ 'దళపతి' వేసే అడుగులు భారత రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి..
Anna ❤😭 pic.twitter.com/vDKWN3pAS1
— Prasanna OG Vote For TVK (@OGprasanna) April 14, 2026

