ఎడిట్ బటన్పై ట్విట్టర్ కీలక ప్రకటన

ఎడిట్ బటన్పై ట్విట్టర్ కీలక ప్రకటన

ట్విట్టర్ యూజర్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న ఎడిట్ బటన్పై ట్విట్టర్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్లో ఉందని ప్రకటించింది. ఇది సక్సెస్ అయితే త్వరలోనే ఈ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ట్విట్టర్లో యూజర్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎడిట్ బటన్ లేకపోవడం. ఏదైనా ట్వీట్ చేసినప్పుడు మిస్టేక్ వస్తే కరెక్ట్ చేసుకునే వీలు లేదు. దీంతో ట్వీట్ డిలిట్ చేయడం అనివార్యం. అందుకే ట్విట్టర్ యూజర్స్ ఎప్పటినుంచో ఎడిట్ బటన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. 

ట్విట్టర్ కొనుగోలు అంశంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎడిట్ బటన్ గురించి ప్రస్తావించారు. అయితే ఆ డీల్ క్యాన్సిల్ అవడంతో ఆ అంశం అటకెక్కింది. ఇప్పుడు ట్విట్టరే స్వయంగా ఎడిట్ బటన్ గురించి చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించి ట్విట్టర్ ఓ ట్వీట్ చేసింది. ‘‘ఇది ఒక ఎడిటెడ్ ట్వీట్.. మేము దీనిని పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొంది. అయితే ఎడిట్ చేసిన ట్వీట్ కింద ఎడిటెడ్ అని టైంతో సహా కన్పిస్తుంది.