వేటగాళ్ల చేతిలో రెండు ఏనుగులు మృతి?

వేటగాళ్ల చేతిలో రెండు ఏనుగులు మృతి?

కియోంజర్: ఒడిషా, కియోంజర్ డిస్ట్రిక్ట్‌లోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రెండు ఏనుగులు చనిపోయిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఏనుగులను వేటగాళ్లు చంపినట్లు తెలుస్తోందని సోమవారం అధికారులు తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి ఆడది కాగా మరొకటి మగది. వీటి మృత దేహాలను గురుబేద ప్రాంతానికి దగ్గర్లోని బైతారాణి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆదివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మగ ఏనుగుకు దంతాలు లేవని, దాని మరణానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆడ ఏనుగుకు సుమారు 20 ఏళ్ల వయస్సు ఉంటుందని, దాని మృత దేహం ఓ వారానికి పైగా అక్కడే పడి ఉన్నట్లు అనిపించదని పేర్కొన్నారు. దాదాపు 22 ఏళ్లు పైబడిన ఈ టస్కర్ మూడ్రోజుల క్రితం మరణించినట్లు అనుమానిస్తున్నారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్‌లో ఈ ఏనుగులను వేటగాళ్లు చంపారని తేలిందని.. అయితే, అటాప్సీ తర్వాతే అసలు కారణం నిర్ధారించడబడుతుందని వివరించారు.