
భద్రాచలం, వెలుగు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. కందమాల్ జిల్లాలోని బలిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుక్లాడ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఒడిశాకు చెందిన డీవీఎఫ్ బలగాలు సోమవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరగ్గా, మావోయిస్టులు పారిపోయారు.
ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నారు. కేకేబీఎన్ డివిజన్‌కు చెందిన ఏరియా కమిటీ మెంబర్ మంకు అలియాస్ రాహుల్, సభ్యుడు చందన్‌గా గుర్తించారు. 303 రైఫిల్, పిస్టల్, ఇతర పేలుడు పదార్ధాలు, నిత్యావసర సరుకులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.