గృహజ్యోతి నమోదుకు మరో రెండు రోజులు

గృహజ్యోతి నమోదుకు మరో రెండు రోజులు
  •     రాజన్న జిల్లాలో 13 మండలాల్లో 350 మందితో వివరాల సేకరణ 
  •     ఆన్​లైన్​ నమోదుకు ప్రత్యేక కౌంటర్లు  

రాజన్నసిరిసిల్ల,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో బాగంగా 'గృహజ్యోతి' అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే  ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ కు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్లలో సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 13 మండలాల్లో ఇప్పటికే దరఖాస్తుల స్కీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

సుమారు 350 మంది సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రీసెంట్​కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులతోపాటు ప్రజాపాలన దరఖాస్తు నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సేకరిస్తున్నారు. దీని ద్వారా లబ్ధిదారులను గుర్తించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ ఇచ్చేందుకు సర్కార్​ సిద్ధమవుతోంది.  ఇందుకోసం ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందించి అందులో వివరాలను నమోదు చేస్తున్నారు. 

యుద్ధప్రాతిపదికన ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు 

 గృహజ్యోతి పథకం కింద వివరాల సేకరణకు ఈ నెల 15 చివరి తేదిగా ప్రభుత్వం ప్రకటించింది. మరో రెండు రోజులు గడువు మాత్రమే ఉండటంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదు చేపడుతున్నారు. జిల్లాలో 1.69 లక్షల  గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారి సంఖ్య 86,472 మంది ఉన్నట్లు కరెంట్​అధికారుల లెక్కల్లో తేలింది.

జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 14వేల మంది వినియోగదారుల దరఖాస్తులు మాత్రమే ఆన్ లైన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.  ఓనర్లతో పాటు అద్దెకు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు.