మ్యూజిక్​తో కరోనా అవేర్​నెస్

మ్యూజిక్​తో కరోనా అవేర్​నెస్

న్యూఢిల్లీ: కరోనా వైరస్​పై అవగాహన కల్పించేందుకు మ్యూజిక్​ను వాడుకుంటోంది యూఏఈకి చెందిన  ఇండియన్​ సంతతి  అమ్మాయి. 14 ఏండ్ల సుచేతా సతీష్.. అరబిక్, తెలుగు, మలయాళం సహా 20కిపైగా భాషల్లో సాంగ్స్​ రికార్డ్​ చేసింది. ఫిజికల్​ డిస్టెన్స్, క్లీన్లీనెస్ పాటించాలని, తరచు చేతులు కడుక్కోవాలంటూ తన పాటల ద్వారా జనంలో అవేర్​నెస్​ తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ‘‘సే నో టు పానిక్” పేరుతో మార్చి 16న ఇంగ్లిష్​లో తొలి కరోనా వైరస్​ అవేర్​నెస్​ సాంగ్​ను రిలీజ్​ చేసింది. ఆ తర్వాత మలయాళం, బెంగాలీ, అరబిక్, కన్నడ, తుళు, కొంకణి, మరాఠి, గుజరాతీ, రాజస్థానీ, సింధి, హిమాచలి, ఒడియా, మణిపూరి, నేపాలి, ఉర్దు, పంజాబీ, భోజ్​పూరి, హిందీ, అస్సామీ, తమిళ్, తెలుగు, సంస్కృతం, కాశ్మీరీ భాషల్లోనూ పాటలు పాడింది. మలయాళం, హిందీ, బెంగాలీ, తమిళ్, అస్సామీలో సుచేత పాడిన పాటలను కేరళ ప్రభుత్వం.. తన బ్రేక్​ ద చైన్​ క్యాంపెయిన్​ కోసం వాడుకుంది.

భావాలు చెప్పడానికి మ్యూజిక్కే బెస్ట్

కేరళకు చెందిన సుచేత దుబాయ్​ ఇండియన్​ హై స్కూల్​లో టెన్త్​ చదువుతోంది. ఒక కన్సర్ట్​లో ఎక్కువ లాంగ్వేజెస్​లో పాటలు పాడిన వరల్డ్​ రికార్డు సుచేత పేరిటే ఉంది. లాంగెస్ట్​ లైవ్​ కన్సర్ట్​ చేసిన చిన్నారిగానూ ప్రపంచ రికార్డు ఆమె సొంతం. తనను తాను కరోనా వారియర్​గా భావిస్తున్న ఆమె ‘‘మ్యూజిక్​ అనేది సమర్థవంతంగా నా భావాలు వ్యక్తీకరించే లాంగ్వేజ్. మా అమ్మ సుస్మిత సాయంతో ఈ పాట రాసుకుని, నేనే కంపోజ్​ చేశా. ఈ వీడియో ఎడిటింగ్​లో మా అమ్మ హెల్ప్​ చేసింది. సరైన సమాచారం ఇవ్వడానికి మా నాన్న నుంచి ఇన్​పుట్స్​ తీసుకున్నా. ఆ తర్వాతే పాట రెడీ చేశా. నా హోం స్టూడియోలోనే రికార్డింగ్​ కంప్లీట్​ చేశాను” అని చెప్పింది. మొదట కరోనా పాటలన్నీ మలయాళంలో రికార్డు చేశానని, వాటికి మంచి రెస్పాన్స్​ రావడంతో మిగతా ఇండియన్ లాంగ్వేజెస్​లోనూ పాటలు పాడానని తెలిపింది.