పాక్ డిగ్రీలు చెల్లవ్

పాక్ డిగ్రీలు చెల్లవ్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో చదివిన డిగ్రీలు చెల్లవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) తెలిపాయు. పాక్ విద్యాసంస్థల్లో ఎవరూ తమ పేర్లను నమోదు చేసుకోవద్దని విద్యార్థులను కోరాయి. దీన్ని ఉల్లంఘించిన వారు భారత్ లో పైచదువులు, ఉద్యోగాలకు అనర్హులవుతారని స్పష్టం చేశాయి. ఉన్నత చదువుల కోసం ఎవరూ దాయాది దేశానికి వెళ్లొద్దని తేల్చి చెప్పాయి. భారత పౌరులతో పాటు 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' స్టూడెంట్స్ కు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నాయి. 

పాక్ నుంచి ఇండియాకు వలస వచ్చిన వారు, వారి పిల్లలు ఇక్కడ పౌరసత్వం పొంది ఉంటే.. ఇక్కడి ఉద్యోగాలకు అర్హులేనని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. అయితే, వారు కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికేట్ పొంది ఉండాలని తెలిపింది. మన దేశ ప్రమాణాలకు అనుగుణంగా లేని సంస్థల నుంచి డిగ్రీలు పొంది ఇబ్బంది పడొద్దనేదే తమ అభిమతమని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుధ్దే తెలిపారు.

మరిన్ని వార్తల కోసం:

రష్యాపై భారత్ ఆధారపడటం మాకు నచ్చట్లే

పీకే రాకను స్వాగతిస్తాం

V6 న్యూస్ చానెల్ కు జాతీయస్థాయి అవార్డు