13 భాషల్లో సెంట్రల్ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్

13 భాషల్లో సెంట్రల్ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్

ఇకపై దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో (సెంట్రల్ యూనివర్సిటీలు) అడ్మిషన్ల కోసం ఒకే ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయం తీసుకుంది. దేశంలో దాదాపు 50 వరకు కేంద్రీయ విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ఒక్కో వర్సిటీ ఒక్కో విధానాన్ని అవలంభిస్తోంది. కొన్ని యూనివర్సిటీలు కామన్ ఎంట్రెన్స్ నిర్వహించి అడ్మిషన్లు ఇస్తుండగా.. మరికొన్ని 12వ తరగతి రిజల్ట్స్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తొలగించేలా దేశమంతా ఒకటే విధానం తీసుకురావాలని యూజీసీ నిర్ణయించింది. ఇక నుంచి ఈ వర్సిటీల్లో ప్రవేశాలకు తప్పనిసరిగా సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) రాయాల్సిందేనని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పరీక్ష 13 భాషల్లో నిర్వహిస్తామని చెప్పారు. 

ఈ కామన్ టెస్ట్ విధానం అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీ రిఫామ్ అని యూజీసీ చైర్మన్ అన్నారు. ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీల్లో చదవాలనుకునే వాళ్లు వేర్వేరు పరీక్షలు రాయాల్సి వస్తోందని, ఇకపై ఇబ్బంది ఉండబోదని చెప్పారు. ప్రస్తుతం యూనివర్సిటీలు అనుసరిస్తున్న రిజర్వేషన్, అడ్మిషన్ పాలసీల్లో మార్పు ఉండబోదని, అయితే ప్రవేశాలకు కల్పించేందుకు మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశామన్నారు. ఈ పరీక్ష స్కోర్ ఆధారంగా విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాలు కల్పించడం యూనివర్సిటీల సామాజిక బాధ్యత అని జగదీశ్ కుమార్ చెప్పారు. ఈ మేరకు దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు పబ్లిక్ నోటీసులు పంపామని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్

35 వేల మంది టెంపరరీ ఉద్యోగులకు సీఎం గుడ్ న్యూస్