టీకా వేసుకోకపోతే జీతం ఆపేస్తం

V6 Velugu Posted on Jun 24, 2021

  • ప్రభుత్వ ఉద్యోగులకు ఉజ్జయిని కలెక్టర్ ఆదేశం

ఉజ్జయిని: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని కలెక్టర్ కండిషన్ పెట్టారు. లేదంటే జీతాలు నిలిపివేస్తామని ఉత్తర్వులిచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించిన ఉద్యోగులకే జీతాలు అందుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాలో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ కండిషన్ పెట్టామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో కరోనాతో చనిపోయిన ఉద్యోగులు టీకా వేసుకోనట్లు తేలిందని చెప్పారు.

Tagged Salary, stopped, collector, order, vaccinated, , Ujjain

Latest Videos

Subscribe Now

More News