డాక్టర్ల వీసా గడువు పెంపు: బ్రిటన్

డాక్టర్ల వీసా గడువు పెంపు: బ్రిటన్

బ్రిటన్ లో కూడా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది బ్రిటన్. బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసనం తమ దేశంలో పని చేస్తున్న భారత దేశానికి చెందిన డాక్టర్లతో పాటు వివిధ దేశాలకు  చెందిన డాక్టర్ల వీసా గడువును మరో ఏడాదికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ ను అరికట్టేందుకు బ్రిటన్ లో డాక్టర్ల సేవలు అవసరం ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ తో ముగిసే డాక్టర్ల వీసా గడువును ఏడాది పెంచాలని నిర్ణయించింది.