ఫ్యూయెల్ అందకుంటే.. సాయం ఆపేస్తం: యూఎన్

ఫ్యూయెల్ అందకుంటే.. సాయం ఆపేస్తం: యూఎన్

జెరూసలెం:  ఇజ్రాయెల్ నిర్బంధంతో గాజాలో ఇంధనం ఖాళీ అయిందని, తమకు ఇంధనం అందకపోతే సహాయక చర్యలను ఆపేస్తామని యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ హెచ్చరించింది. అయితే, గాజాలోకి ఫ్యూయెల్ ను అనుమతిస్తే దానిని హమాస్ మిలిటెంట్లు ఎత్తుకుపోతారని ఇజ్రాయెల్ నిరాకరిస్తోంది. హమాస్ ఇప్పటికే 5 లక్షల లీటర్ల ఇంధనాన్ని దాచిపెట్టుకుందని చెప్తోంది.

యూఎన్ చీఫ్​పై ఇజ్రాయెల్ ఫైర్

పాలస్తీనా ప్రజలు 56 ఏండ్లుగా అణచివేతకు గురవుతున్నారని, హమాస్ దాడులు ఒక్కరోజులో జరిగినవి కావంటూ యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ చేసిన కామెంట్లపై ఇజ్రాయెల్ మండిపడింది. హమాస్ నరమేధాన్ని సమర్థించిన ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 

గుటెర్రస్ కామెంట్లకు నిరసనగా ఐక్యరాజ్యసమితి సిబ్బందికి వీసాలను నిలిపేస్తామని బుధవారం ఇజ్రాయెల్ అంబాసిడర్ గిలాడ్ ఎర్డన్ ఈ మేరకు హెచ్చరించారు.