బ్రూనో డబుల్‌‌‌‌‌‌‌‌ ధమాకా

 బ్రూనో డబుల్‌‌‌‌‌‌‌‌ ధమాకా

2-0తో ఉరుగ్వేపై ఘన విజయం

లుసైల్‌‌‌‌‌‌‌‌ (ఖతార్): సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ క్రిస్టియానో రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్‌‌‌‌‌‌‌‌  ఫిఫా వరల్డ్ కప్​లో నాకౌట్​కు దూసుకెళ్లింది. బ్రూనో ఫెర్నాండెస్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ గోల్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగడంతో సోమవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్–హెచ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పోర్చుగల్‌‌‌‌‌‌‌‌ 2–0తో ఉరుగ్వేను చిత్తు చేసింది. వరుసగా రెండో విజయంతో గ్రూప్‌‌‌‌‌‌‌‌లో రొనాల్డోసేన 6 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఓ డ్రా, మరో ఓటమితో ఉరుగ్వే ఒకే పాయింట్‌‌‌‌‌‌‌‌తో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచి నాకౌట్‌‌‌‌‌‌‌‌ రేసు నుంచి దాదాపు వైదొలిగింది. 

హోరాహోరీలో ఫెర్నాండెస్​ హవా

తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిచిన జోరులో పోర్చుగల్‌‌‌‌‌‌‌‌.. నాకౌట్ రేసులో నిలవాలన్న ఆశతో ఉరుగ్వే ఈ పోరులో హోరాహోరీగా తలపడ్డాయి. బాల్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో కాస్త పైచేయి సాధించిన రొనాల్డోసేన అటాకింగ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ ఆడింది. ప్రత్యర్థి డిఫెన్స్‌‌‌‌‌‌‌‌లోకి చొచ్చుకెళ్లి  దాడులు చేసింది. మరోవైపు 32వ నిమిషంలో ఉరుగ్వే ప్లేయర్‌‌‌‌‌‌‌‌ వెసినో గోల్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నాన్ని  పోర్చుగల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ కోస్టా అడ్డుకున్నాడు. కాసేపటికే  రొనాల్డో తన ఛాతి అడ్డంపెట్టి ఇచ్చిన పాస్​కు  ఫెలిక్స్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ కొట్టినా అది నెట్‌‌‌‌‌‌‌‌ పైనుంచి వెళ్లిపోయింది. దాంతో, ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లూ ఖాతా తెరవలేకపోయాయి. సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లో పోర్చుగల్‌‌‌‌‌‌‌‌ దాడులు ముమ్మరం చేసింది.

ఈ క్రమంలో 54వ నిమిషంలో గురెయిరో నుంచి పాస్‌‌‌‌‌‌‌‌ అందుకున్న బ్రూనో ఫెర్నాండెస్ లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ నుంచి కొట్టిన క్రాస్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌కు స్వింగ్‌‌‌‌‌‌‌‌ అయిన బాల్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌ వద్ద ఓ బౌన్స్‌‌‌‌‌‌‌‌ తీసుకొని గోల్‌‌‌‌‌‌‌‌గా వెళ్లింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో స్కోరు సమం చేసేందుకు ఉరుగ్వే చాలా ప్రయత్నాలు చేసింది. 72వ నిమిషంలో గోమేజ్‌‌‌‌‌‌‌‌ డి బాక్స్‌‌‌‌‌‌‌‌ నుంచి  కొట్టిన షాట్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌ రైట్​ బార్‌‌‌‌‌‌‌‌కు తగిలి పక్కకు వెళ్లిపోవడంతో మరో చాన్స్‌‌‌‌‌‌‌‌ మిస్సయింది.  మ్యాచ్‌‌‌‌‌‌‌‌ చివరి నిమిషంలో ఉరుగ్వే ప్లేయర్‌‌‌‌‌‌‌‌ గిమెనెజ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను చేతితో తాకడంతో  రిఫరీ పోర్చుగల్‌‌‌‌‌‌‌‌కు పెనాల్టీ ఇచ్చాడు. దీన్ని ఫెర్నాంజెస్‌‌‌‌‌‌‌‌  సింపుల్‌‌‌‌‌‌‌‌గా గోల్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పోర్చుగల్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ డబులైంది. ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌‌‌‌‌ ఆఖర్లోనూ అతను కొట్టిన షాట్‌‌‌‌‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌కు తగలడంతో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ గోల్స్‌‌‌‌‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌  కొద్దిలో మిస్సయ్యాడు.