ఇయ్యాల నిర్మలా సీతారామన్ 2వ రోజు టూర్

ఇయ్యాల నిర్మలా సీతారామన్ 2వ రోజు టూర్

కామారెడ్డి: కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన ఇవాళ రెండో రోజుకు చేరింది. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆమె ఇవాళ రెండో రోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం బాన్సువాడలో పార్టీ కార్యకర్త ఇంట్లో అల్పాహారంతో కార్యక్రమాలు మొదలవుతాయి. అక్కడి నుండి బీర్కుర్ వెళతారు. బీర్కుర్ మండల కేంద్రంలో రేషన్ షాప్ కు వెళ్లి లబ్దిదారులతో మాట్లాడతారు. అనంతరం  కోటగిరి వెళ్లి వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలిస్తారు. తర్వాత రుద్రుర్  లో ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి వర్ని మండల కేంద్రంలో  ఐటీ వింగ్ తో జరిగే సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటారు.