నిందితుల నుంచి వివరాలు సేకరించే విధానంలో మార్పులు

నిందితుల నుంచి వివరాలు సేకరించే విధానంలో మార్పులు

న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిందితుల గుర్తింపు, వారి నుంచి సేకరించే వివరాల్లో మార్పులు తీసుకొస్తున్నామన్నారు అమిత్ షా. అయితే ఈ బిల్లు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్నారు చిదంబరం, వ్యక్తుల స్వేచ్ఛ, గోప్యత, గౌరవాన్ని ఉల్లంఘిస్తుందన్నారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. 
కాంగ్రెస్ పై మండిపడ్డ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టెర్రరిస్టు దాడులన్న కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, మాజీ మంత్రి చిదంబరం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. చిదంబరం, ఆజాద్ కలసి గతంలో తనతోపాటు తమ నేత ఏపీ సీఎం జగన్ పై తప్పుడు అభియోగాలతో కేసులు పెట్టించారని ప్రస్తావించారు. 
 

 

ఇవి కూడా చదవండి

వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయిస్తారా..?

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు 

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు