ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా

ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా

ఈ నెల 21న రాష్ట్రంలో  కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మునుగోడు బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. దీనికి సంబంధించి అధికారిక షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈనెల‌ 21న మధ్యాహ్న 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రానున్నారు. శంషాబాద్ నుంచి హెలికాప్టర్ లో సాయంత్రం 4.25 గంటలకు మునుగోడుకు వెళ్లనున్నారు. 4.35 నుండి 4.50 వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.  

అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి చేరిక

సాయంత్రం 4.50 నుంచి 6 గంటలకు వరకు మునుగోడు సభలో హోంమంత్రి పాల్గొననున్నారు. ఈ సభలోనే అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయకండువా కప్పుకోనున్నారు. బహిరంగ సభ తర్వాత రామోజీ ఫిలిం సిటీ వెళ్లనున్నారు. 6.45 నుండి 7.30 వరకు రామోజీ ఫిలిం సిటీలో ఉండనున్నారు. 7.30కు అక్కడి నుంచి బయలుదేరి నోవాటెల్ కు చేరుకుంటారు. నోవాటెల్లో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశంకానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, రానున్న అసెంబ్లీ ఎన్నికల‌ నేపథ్యంలో రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి 9.40కి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.