కేయూ సూపరింటెండెంట్ పోస్టింగ్​ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలి

కేయూ సూపరింటెండెంట్ పోస్టింగ్​  ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలి

హనుమకొండ, వెలుగు:  కాకతీయ యూనివకేయూ సూపరింటెండెంట్ పోస్టింగ్​  ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలిర్సిటీలో   సూపరింటెండెంట్ పోస్టు  భర్తీలో అవకతవకలు జరిగాయని,   ఇటీవల ల్యాబ్​ అసిస్టెంట్​ నర్మదకు  సూపరింటెండెంట్​గా ఇచ్చిన  ఆర్డర్స్​ను రద్దు చేయాలని   అభ్యర్థులు, ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  సూపరింటెండెంట్ పోస్టుకు నాలుగేండ్ల కిందట నిర్వహించిన రాత పరీక్షలో  నర్మద ఫెయిల్​ అయిందని, అయినా   రూల్స్​కు విరుద్ధంగా రీవాల్యూయేషన్​  చేసి,  ప్రమోషన్   ఇచ్చారని తెలిపారు.

రాత పరీక్ష ఫలితాలు వచ్చి  నాలుగేండ్లు దాటిన తర్వాత రీవాల్యుయేషన్ ఎలా చేస్తారని  ప్రశ్నించారు. అధికారులు స్పందించి    ప్రమోషన్   ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలని  డిమాండ్ చేశారు.  ఈ క్రమంలో  రిజిస్ట్రార్, ఉద్యోగ సంఘాల నేతలతో వాగ్వాదం జరిగింది.    ఉత్తర్వులను  రద్దు చేసేంత వరకు పోరాడుతామని ఉద్యోగ సంఘాల నేతలు వల్లాల తిరుపతి, యాదగిరి, సతీశ్, షుక్రూ  అన్నారు.   వినతి పత్రం  ఇచ్చిన వారిలో   ల్యాబ్ అసిస్టెంట్ ప్రతాప్, సీనియర్ అసిస్టెంట్లు కృష్ణమూర్తి, సదాశివుడు, రాజు, మజర్ అలీ  ఉన్నారు.