అఖిలేశ్కు యోగి షేక్ హ్యాండ్

అఖిలేశ్కు యోగి షేక్ హ్యాండ్

లక్నో: సోమవారం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రతి పక్ష నేత, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కు సీఎం యోగి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దానికంటే ముందు  సీఎం యోగి అసెంబ్లీలో హాల్ లోకి రాగానే సభ్యులందరూ లేచి నిలబడ్డారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ముందు వరుసలో కూర్చున్న అఖిలేశ్ కూడా తన సీట్లో నుంచి లేచి యోగిని విష్ చేశారు. యోగి కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ అఖిలేశ్ భుజంపై తట్టారు. మొన్నటి వరకు ఒకరిమీద మరొకరు కత్తులు దూసుకున్న ఇద్దరు అగ్ర నేతలు  ఒకరినొకరు  నవ్వుకుంటూ పలకరించుకున్నారు. 

ఇవి కూడా చదవండి..

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది

అంగరంగ వైభవంగా ఆస్కార్ ప్రదానోత్సవం