ఊర్లలోనూ జోరందుకున్న యూపీఐ పేమెంట్లు

ఊర్లలోనూ జోరందుకున్న యూపీఐ పేమెంట్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: ఊర్లలో సైతం యూపీఐ పేమెంట్లు జోరందుకున్నాయి. రూరల్​ ఏరియాలలోని ప్రజలు కూడా లోకల్​గా ఉండే కిరాణా, మెడికల్​,  మొబైల్​ రీఛార్జ్​ షాపులు, ట్రావెల్​ ఏజంట్లు, కస్టమర్​ సర్వీస్​ పాయింట్లు (సీఎస్​పీ)ల సాయంతో డిజిటల్​ చెల్లింపులు జరుపుతున్నారు. నగదు విత్​డ్రాయల్, ఎంఎస్​ఎంఈ క్రెడిట్​, యుటిలిటీ పేమెంట్లు, ఈ–కామర్స్​ వంటి వాటి కోసం డిజిటల్​ లావాదేవీలనే వారు నిర్వహిస్తున్నట్లు పేనియర్​బై సర్వేలో తేలింది. దీంతో సెమి అర్బన్​ ఏరియాలలో 25 శాతం, రూరల్​ ఏరియాలలో 14 శాతం అసిస్టెడ్​ ఫైనాన్షియల్​ ట్రాన్సాక్షన్లు పెరిగినట్లు ఈ సర్వే వెల్లడించింది. తమ బ్యాంకింగ్​, లైఫ్​స్టైల్​ అవసరాలకు డిజిటల్​ పద్ధతులనే అలవాటు చేసుకోవడం ద్వారా వారు ఫార్మల్​ ఎకానమీలో భాగమవుతున్నట్లు ఈ సర్వే పేర్కొంది.

650 శాతం గ్రోత్​

రూరల్​ ఏరియాలలోని తమ రిటెయిల్​ కౌంటర్లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు ఏకంగా 650 శాతం పెరిగినట్లు పేనియర్​బై తెలిపింది. డిజిటల్​ ఫైనాన్షియల్​ ఇన్​క్లూజన్​లో యూపీఐ కీలకపాత్ర పోషించగలదనే విషయం దీంతో స్పష్టమవుతోందని పేర్కొంది.  రిటెయిల్​ఓ నోమిక్స్​ పేరిట ఒక రిపోర్టును పేనియర్​బై విడుదల చేసింది. దేశంలోని 10 లక్షల రిటెయిల్​టచ్​పాయింట్ల నుంచి సేకరించిన సమాచారంతో ఈ రిపోర్టును రూపొందించినట్లు పేనియర్​బై వివరించింది. జనవరి 2022 నుంచి అక్టోబర్​ 2022 మధ్య కాలానికి సంబంధించిన డేటాను సేకరించినట్లు పేర్కొంది. 

నగదు కోసం మైక్రో ఏటీఎంలు...

నగదు విత్​డ్రాయల్స్​ కోసం రూరల్​, సెమి అర్బన్​ ఏరియాలలోని ప్రజలు ప్రధానంగా మైక్రో ఏటీఎంలపైనే ఆధారపడుతున్నారు. దీంతో వాటి వాల్యూ, వాల్యూమ్​ రెండూ పెరిగినట్లు పేనియర్​బై వెల్లడించింది. ఈ మైక్రో ఏటీఎంల ద్వారా నగదు విత్​డ్రాయల్స్​ విలువ రీత్యా 25 శాతం గ్రోత్​ సాధించినట్లు పేర్కొంది. క్యాష్​ కలెక్షన్​ బిజినెస్​ (ఈఎంఐల వంటివి)  కూడా రూరల్, సెమి అర్బన్​ ఏరియాలలో 200 శాతం పెరిగి నెలకు  రూ. 1,400 కోట్లకు చేరినట్లు పేనియర్​బై సర్వే రిపోర్టు వివరించింది. ఈ–కామర్స్​ కంపెనీల లావాదేవీలతోపాటు, ఇన్సూరెన్స్​ ప్రీమియం చెల్లింపుల వంటివీ రూరల్​ ఏరియాలలోని ప్రజలు డిజిటల్​గా జరుపుతున్నారని పేర్కొంది. అసిస్టెడ్​ కామర్స్​, ఓటీటీ సబ్​స్క్రిప్షన్​, మైక్రో–లెండింగ్​ వంటి వాటి వల్ల రూరల్​ ఏరియాలు సైతం డిజిటల్​ చెల్లింపులలో దూసుకెళ్తున్నాయని పేనియర్​బై ఎండీ ఆనంద్​ కుమార్​ బజాజ్​ చెప్పారు. ఈ ఏడాది మొదటి 10 నెలల్లో రూ. 70 వేల కోట్ల విలువైన డిజిటల్​ సర్వీసులను తాము నిర్వహించినట్లు పేర్కొన్నారు. రూరల్​ ఏరియాలలో వాడకానికి అనువుగా టెక్నాలజీలను మరింత ఈజీ చేయడంపై తాము ఫోకస్​ పెడుతున్నామని బజాజ్​ అన్నారు.

నాన్​ బ్యాంకింగ్​ టైములోనే ఎక్కువ...

బ్యాంకులు సాధారణంగా పనిచేయని టైముల్లోనే రూరల్​ ఏరియాలలో ఎక్కువగా అంటే 32 శాతం బ్యాంకింగ్​ ట్రాన్సాక్షన్లు (సాయంత్రం 6 నుంచి రాత్రి 12) జరుగుతున్నట్లు కూడా పేనియర్​బై సర్వేలో తేలడం ఇంకొక విశేషం.