యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ మెయిన్స్ 2021 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన పరీక్షల్లో 1,823 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వారికి ఏప్రిల్ 5 నుంచి ఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అర్హత సాధించిన వారి అడ్మిట్ కార్డులను త్వరలోనే వెబ్ సైట్ లో అందుబాటులో పెట్టనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. 

దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసులకు ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ పరీక్ష నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ  ఇలా మూడు దశల్లో పరీక్షించి ఉద్యోగులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వార్తల కోసం..

మంత్రి బెయిల్కు రూ.3 కోట్లు డిమాండ్

పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం