V6 News

UPSC Recruitment: EPFOలో పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్.. దరఖాస్తు చేసుకోండిలా..

UPSC Recruitment: EPFOలో పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్.. దరఖాస్తు చేసుకోండిలా..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు EPFO పర్సనల్ అసిస్టెంట్ రిక్రూట్ మెంట్ 2024 దరఖాస్తు ఆన్ లైన్ లింక్ ను 07 మార్చి 2024 నుంచి http://upsconline.nic.in/లో యాక్టివేట్ చేసింది. అర్హత, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్, జీతం,దరఖాస్తు చేయు విధానం వంటి వివరాలన్నింటిని ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. 

మొత్తం పోస్టులు: పర్సనల్ అసిస్టెంట్ (PA):323

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. స్టోనో, టైపింగ స్కిల్స్ ఉండాలి. 

అప్లయ్ చేయు విధానం: ఆన్ లైన్ లో అప్లికేషన్ సబ్ మిట్ చేయాలి 

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 7 2024 నుంచి మార్చి 27 2024 సాయంత్రం 6 గంటల వరకు 

గరిష్ట వయోపరిమితి : అభ్యర్థులందరికి  18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

  • జనరల్ అభ్యర్థులకు  30 సం//లు 
  • ఓబీసీ అభ్యర్థులకు - 33 సం//లు 
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు - 35 సం//లు 
  • దివ్యాంగ అభ్యర్థులకు - 40సం//లు 

 ఎంపిక విధానం : రాత పరీక్ష-స్కిల్ టెస్ట్-డాక్యుమెంట్ వెరిఫికేషన్-మెడికల్ ఎగ్జామినేషన్ 

జీతం: రూ. 44,900 (7వ పేమ్యాట్రిక్స్ ప్రకారం) 

అధికారిక వెబ్ సైట్ : www.upsc.gov.in 

పరీక్ష తేది: 7జూలై 2024

ALSO READ :- Rakul Preet Singh: దైవ దర్శనంలో..రకుల్ భగ్నానీ జంట