రైతు నిరసనలను లెఫ్ట్ వింగ్ హైజాక్ చేసింది

రైతు నిరసనలను లెఫ్ట్ వింగ్ హైజాక్ చేసింది

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల విషయం తిరిగి చర్చలకు రావాల్సిందిగా రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు. అయితే ఈ నిర్ణయాన్ని లెఫ్టిస్ట్-మావోయిస్ట్ అంశాలు ప్రభావితం చేయకూడదన్నారు. రైతుల నిరసనలను లెఫ్టిస్టు-మావోయిస్టులు నియంత్రణలోకి తీసుకున్నారని ఆరోపించారు. రైతు సమస్యలపై చర్చల కంటే ఇతర ఎజెండాలకే వారు ప్రధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అన్నదాతలను కొన్ని శక్తులు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చల విషయంలో నిజాయితీగా ఉందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయని గుర్తు చేశారు. రైతుల నిరసనలను లెఫ్ట్ వింగ్ లాబీ గ్యాంగ్ హైజాక్ చేసిందన్నారు.