
వాషింగ్టన్ : రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం భారత్ అడిగిన హర్పూన్ బ్లాక్-2 ఎయిర్ లాంచ్ మిస్సైల్స్‌తో పాటు లైట్ వెయిట్ టార్పిడోలను ఇచ్చేందుకు అమెరికా ఓకే చెప్పింది. భారత్ కు వీటిని అమ్మేందుకు సోమవారం అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే 10 ఏజీఎం -84ఎల్ హర్పూన్ బ్లాక్-2 ఎయిర్ లాంచ్ మిస్సైల్స్, 16 ఎంకేఈ 54 లైట్‌వెయిట్ టార్పిడోలు, మూడు ఎంకే 54 ఎక్సర్‌సైజ్ టార్పిడోలు భారత్ కు రానున్నాయి. ఇందుకోసం అమెరికాకు మనదేశం 16 కోట్ల డాలర్లను ఇవ్వనుంది. భారత్ అభ్యర్థన మేరకు రక్షణ ఆయుధాలను అమ్మనున్నట్లు పెంటగాన్ తెలిపింది. రీజినయన్ థ్రెట్స్ ను ఎదుర్కొవటానికి ఇండియా ఈ ఆయుధాలను వాడుతుందని అమెరికా ప్రకటించింది. హర్పూన్ మిస్సైళ్లను బోయింగ్, టార్పిడోలను రేథియాన్ సంస్థలు భారత్ కు ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆయుధాలతో భారత్ రక్షణ వ్యవస్థ పటిష్టం కానుంది. ఎంకే 54 టార్పిడోలతో యాంటీ సబ్‌మెరైన్ల యాంటీ సబ్ మెరైన్ ప్రకియలో వాడతారు. ఈ ఒప్పందంతో భారత్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలు మరింత పెరగనున్నాయి.