అమెరికా చైనా మధ్య కార్ వార్ అవసరమా.?

అమెరికా చైనా మధ్య కార్ వార్ అవసరమా.?

రెండు దేశాలు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటే ఒకటి విజయం సాధిస్తుందేమోగానీ ఎకానమీ పరంగా రెండూ నష్టపోక తప్పదు. పరోక్ష యుద్ధం(కోల్డ్ వార్ )లో అయితే అసలు విన్నరే ఉండరు. ఈ విషయాన్ని గ్రహించని అమెరికా.. చైనాతో మరోసారిటెక్నాలజీ టెన్షన్స్ కి తెర తీస్తోంది. ఆ ఎఫెక్ట్ ఈసారి కార్ల పరిశ్రమపై పడనుంది. ఇది లాంగ్టర్మ్ లో యూఎస్ నే దెబ్బతీస్తుంది. అమెరికా వల్ల తనకు కలిగే నష్టాన్ని యూరప్, ఇజ్రాయేల్, జపాన్ వంటి దేశాల సాయంతో చైనా భర్తీ చేసుకుంటుంది.

ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ అయిన అమెరికాలోని డెట్రాయిట్ నగరాన్ని ‘మోటర్సిటీ’ అని కూడా అంటారు. అక్కడి బడా ఆటో మేకర్లు ఇప్పుడు టెస్టింగ్ టైమ్‌ ని ఎదుర్కొంటున్నారు. ఇకపై ఏవాహనాలను రూపొందించాలో తెలియక డైలమాలో పడ్డా రు. పికప్ ట్రక్కులు, డ్రైవర్ లెస్ కార్లు, ఇంటర్నల్కంబషన్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ మోటర్లు, హార్డ్​వేర్ లేదాసాఫ్ట్ వేర్.. ఇలా అన్నిం టినీ తయారుచేసే కెపాసిటీ ఆకంపెనీలకు ఉంది. అయితే.. వాటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలో అర్థం కావట్లేదు.

ఈ అయోమయం ఇలా ఉండగానే మరో పెద్ద ప్రశ్నఎదురైంది. ‘వరల్డ్‌‌ ఇండస్ట్రియల్‌‌ సెక్టార్‌‌ రూపురేఖల్ని మార్చగలిగే మొబిలిటీ రెవల్యూషన్ ఏ దేశంలో రానుంది? అమెరికాలోనా, చైనాలోనా?’ అనేదే ఆసందేహం. ఈ గందరగోళానికి కారణం అమెరికాచైనాల కోల్డ్​వార్. టెక్నాలజీకి సంబంధించి ఈరెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న టెన్షన్లను పూర్తిగా యుద్ధంతో పోల్చలేం . కానీ.. పరిస్థితి అలాగేఅనిపిస్తోంది. వాళ్ల మధ్య సంబంధాలను పర్మనెంట్ గా  దెబ్బతీసే విషయాల్లో టెక్నాలజీ ఒకటి కానుంది.చైనాకి అమెరికా నుంచి అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఎగుమతులను తగ్గించాలని వైట్ హౌస్‌‌ అతివాదులు ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్ పై ఈ మధ్య ఒత్తిడి తెస్తున్నా రు.అంతేకాదు. చైనాలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నకొన్ని యూఎస్ సంస్థలను స్వదేశీ మార్కెట్ కి రప్పించాలని కూడా డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి.అమెరికా–చైనా ఎకానమీని ‘ఐరన్ కర్టెన్ లు’ వేరుచేయబోతున్నా యని యూఎస్ ఆర్థిక శాఖ మాజీ మంత్రిహంక్ పౌల్సన్ ఇటీవలే హెచ్చరించటం ఆ న్యూస్ కిబలం చేకూరుస్తోంది.

హార్డ్​లైనర్ల కోరిక మేరకు ప్రభుత్వం ఒకవేళ చైనా పట్లతీవ్రంగా స్పందిస్తే తమ భవిష్యత్తు ఏంటని అమెరికాఆటో ఎగ్జిక్యూ టివ్ లు ఆందోళన చెందుతున్నారు.హైటెక్ ఎగుమతులను నిలిపేసే నిర్ణయం లాంగ్రన్ లో ఫెయిల్ అవుతుం దని, ‘చెరపకురా చెడేవు’మాదిరిగా అమెరికాకే నష్టదాయకమని ఫీలవుతున్నారు. నిజానికి.. చైనాతో సాం కేతిక, ఆర్థిక బంధుత్వం లేకపోవటాన్ని యూఎస్ ఆటోమేకర్లు భరిం చలేరు.అమెరికా దశాబ్దాల నుంచి పారిశ్రామికంగా అద్భుతమైన అభివృద్ధి సాధించడానికి కారణం డ్రాగనే.ఐఫోన్ లాగే అత్యధిక ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ లు ‘మేడిన్ చైనా’ముద్రతోనే ప్రపంచానికి సరఫరా అవుతున్నా యి. ఈనేపథ్యంలో అమెరికా గనుక చైనాకి టెక్ ఎక్స్ పోర్ట్లపై ఆంక్షలు విధిస్తే ఈ పారిశ్రామిక ప్రగతి వేగంకాస్త తగ్గుతుందేమో గానీ పూర్తిగా మాత్రం ఆగదు.ఎలక్ట్రిక్ వస్తువుల తయారీలో చైనా ఇప్పటికే ప్రణాళికా బద్ధంగా ముం దుకెళుతోం ది. ప్లాన్డ్​ ఎకానమీలోభాగంగా ఎలక్ట్రిక్ కార్ల ప్రొడక్షన్, సేల్స్ , సబ్సిడీలు,ఆఫర్లు, బీజింగ్ వంటి మెగాసిటీల్లో లైసెన్స్ ప్లేట్ల అందుబాటుకు సంబంధించి చైనీస్ రెగ్యు లేటర్లు స్థానిక ఆటోమేకర్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వనున్నారు.

చైనాతో పోటీ సాధ్యమా?

2020 నాటికి ఏటా 20 లక్షల ఎలక్ట్రిక్ కార్లను అమ్మాలని చైనా టార్గెట్ గా పెట్టుకుంది. ఇది అమెరికాతో పోల్చితే 20 రెట్లు ఎక్కువ. రైడ్ షేర్ జెయింట్ అయిన‘దిది చుక్సిం గ్ ’కి ప్రస్తుతం 550 మిలియన్ రైడర్లు ఉన్నా రు. ఇది ప్రపంచవ్యా ప్తంగా ఉబర్ క్యాబుల్లో ప్రయాణించేవారి కన్నా ఐదు రెట్లు అధికం. అమెరికాకన్నా ఏడాది ముందుగానే చైనా 5జీ నెట్ వర్క్​ను ఏర్పాటు చేసింది. దీంతో రోడ్ సైడ్ సెన్సా ర్, రాడార్ అప్లికేషన్ల సంఖ్య పెరుగుతుంది. క్యా బ్‌ సర్వీసులకుఈ రకమైన డ్రైవిం గ్ ఎంతో ముఖ్యం.దీన్ని బట్టి టెక్నాలజీలో చైనాతో పోటీ అమెరికాకుకష్టమని అర్థమవుతోంది. యూఎస్ బాధా అదే. ఈఉద్దేశంతోనే చైనాతో కోల్డ్​వార్ కి కాలుదువ్వుతోం ది.అమెరికా ఫ్రస్టేషన్ ని అర్థం చేసుకున్న చైనా.. ఫారన్ఓనర్ షిప్ కలిగి న ఆటో జాయిం ట్ వెం చర్ల మూసివేతనిర్ణయాన్ని ఎత్తేయటం ఆహ్వానిం చదగ్గ పరిణామం.కానీ ఈ లోపే గూగుల్ వంటి యూఎస్ టెక్ కంపెనీలుచైనా నుం చి వెళ్లిపోయాయి. దీన్ని బట్టి కోల్డ్​ వార్ లోవిన్నర్లు ఉండరనే సత్యాన్ని గ్రహిం చాలి.

జనరల్ మోటార్స్ ’కిచైనాలో మళ్లీ జీవం

2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూరుకుపోయిన జనరల్ మోటార్స్ కంపెనీకి చైనా మళ్లీజీవం పోసింది. అక్కడ సేల్స్ పెరగటం వల్లేసంస్థ నిలబడగలిగింది. జనరల్ మోటార్స్రూపొందిం చిన కొత్త ప్యాసిం జర్ కార్ల తయారీచైనాలో మొదట కాస్త మందగించింది. అయినాఇప్పు డు యూఎస్ , జపాన్ , జర్మనీ వంటిమూడు పెద్ద దేశాల్లోని మొత్తం కార్ల అమ్మకాలతో పోల్చితే చైనాలోనే అధికంగా సేల్స్ నమోదవుతున్నా యి. ఏ దేశంలోనూ లేనంత మ్యానుఫ్యా క్చరింగ్ కూడా అక్కడే జరుగుతోంది.