ఇంతటి ఘోరం చూస్తాననుకోలేదు: జో బైడెన్

ఇంతటి ఘోరం చూస్తాననుకోలేదు: జో బైడెన్

హమాస్ టెర్రరిస్టులు చిన్నారుల తలలను నరుకుతున్న ఫొటోలు తాను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ అన్నారు. ఇజ్రాయెల్ దాడులపై ఆయన స్పందించారు. ‘‘హమాస్ కేవలం టెర్రరిజాన్ని కాదు.. ఈ ప్రపంచానికి ముప్పు తీసుకొచ్చింది. ఐసిస్ దారుణాల కంటే కూడా హమాస్ చర్యలు భయంకరంగా ఉన్నాయి. ఎంతో మంది ఇజ్రాయెల్ నేతలు, ప్రపంచ లీడర్లతో మాట్లాడుతున్నాను.

 ఇజ్రాయెల్​కు అమెరికా అండగా ఉంటది. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. హమాస్ వద్ద బందీలుగా ఉన్న అమెరికన్ల గురించి ఆలోచిస్తున్నాం” అని బైడెన్ అన్నారు. హమాస్ మిలిటెంట్లకు ఫండ్స్, ట్రెయినింగ్ ఇస్తూ ఇరాన్ వెనకుండి నడిపిస్తోందని ఆయన ఆరోపించారు.