అమెరికా అధ్యక్షుడు..సైకిల్ తొక్కుతూ కిందపడ్డాడు

అమెరికా అధ్యక్షుడు..సైకిల్ తొక్కుతూ కిందపడ్డాడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ సైకిల్​పై నుంచి కింద పడ్డారు. శనివారం 45వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జిల్​ బైడెన్​​తో కలిసి డెలావేర్​లోని రెహోబోత్​ బీచ్​లో సరదాగా గడిపారు. తరువాత సైకిల్​పై  రైడింగ్​కు వెళ్లి ఒక్కసారిగా కింద పడ్డారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ ఆయన్ను పైకి లేపగా.. ‘‘నాకేం కాలే. పెడల్​పై నుంచి కాలు తీసే టైంలో అదుపు తప్పి కింద పడ్డాను” అంటూ చెప్పారు.