
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సతీమణి మెలానియా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ట్రీట్‌మెంట్ కోసం వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ట్రంప్ చేరారని వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. వైద్య నిపుణుల సిఫార్సు మేరకు రాబోయే కొద్ది రోజులు వాల్టర్ రీడ్‌లోని ప్రెసిడెన్షియల్ ఆఫీసెస్ నుంచి ట్రంప్ పని చేస్తారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెకెన్నీ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ట్రంప్‌కు నిర్వహించిన టెస్టులు, ట్రీట్‌మెంట్ గురించి మెకెన్నీ ఎటువంటి వివరాలు చెప్పలేదు. ట్రంప్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైట్ హౌజ్ ఫిజిషియన్ తెలిపారు.