ఇండియాకు చైనా నుంచి పెనుసవాళ్లు

ఇండియాకు చైనా నుంచి పెనుసవాళ్లు

వాషింగ్టన్: చైనా నుంచి ఇండియా పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని అమెరికా అభిప్రాయపడింది. ప్రధానంగా లైన్ ఆఫ్​ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి చైనా బిహేవియర్ ఇండియాకు ముప్పుగా మారుతోందని పేర్కొంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సర్కారు ఈ మేరకు శుక్రవారం ఫస్ట్ ‘ఇండో- – పసిఫిక్ స్ట్రాటజీ’ని విడుదల చేసింది. ఇండో– పసిఫిక్ ప్రాంతం బలోపేతం చేయడం, ఇండియా ఎదుగుదలకు సపోర్ట్ చేయడం వంటి అంశాలను ఈ స్ట్రాటజీలో చేర్చింది. ‘‘దక్షిణాసియాలో స్థిరత్వాన్ని పెంచేందుకు ప్రాంతీయ కూటముల ఏర్పాటు, ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఒక స్ట్రాటజిక్ పార్ట్​నర్​షిప్​ను నిర్మించేందుకు మేం ప్రయత్నాలు కొనసాగిస్తాం. ఇండో– పసిఫిక్ లో ప్రధానంగా హెల్త్, స్పేస్, సైబర్ స్పేస్, టెక్నాలజీ, ఎకానమీ రంగాల్లో సహకారం అందిస్తాం. ఈ ప్రాంతంలో అందరికీ స్వేచ్ఛగా యాక్సెస్ ఉండేలా కృషి చేస్తాం” అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.  దక్షిణాసియా, ఇండియన్ ఓసియన్ లో లీడర్ గా ఉన్న ఇండియా తమకు సరైన పార్ట్ నర్ అని, క్వాడ్, ఇతర రీజనల్ గ్రూపులకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ అని మెచ్చుకుంది. అయితే, ఇండియాకు ప్రధానంగా చైనా నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయని 
ఆందోళన వ్యక్తం చేసింది.