
వాషింగ్టన్: రష్యా నుంచి ఎస్400 ట్రయంప్మిసైళ్లను కొంటున్న ఇండియాపై ‘కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్(కాట్సా)’ ఆంక్షలు విధించొద్దని ఇద్దరు పవర్ఫుల్అమెరికా సెనెటర్లు ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్‌ను కోరారు. నేషనల్ ఇంట్రస్ట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇండియాకు మినహాయింపునివ్వాలని డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనెటర్ మార్క్ వార్నర్, రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్ జాన్ కొర్నిన్ మంగళవారం ప్రెసిడెంట్‌కు లెటర్ రాశారు. ‘ఎస్400 మిసైళ్లు కొనేందుకు 2018లో రష్యాతో ఇండియా ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి అంతకు రెండేళ్ల ముందే సంతకాలు చేసింది. అయితే ఆ మిసైళ్లను గనక ఇండియా కొంటే కాట్సా శాంక్షన్‌ను అమెరికాఅమలు చేసే అవకాశం ఉంది. ఆ చట్టం అమలు చేస్తే ఇండియాతో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రభావం పడుతుంది. పైగా రష్యా ఆయుధాలు కొనకుండా ఆపాలన్న లక్ష్యం కూడా నెరవేరదు’ అని సెనెటర్లు లెటర్లో వివరించారు.
అమెరికాకూ నష్టమే
రష్యా నుంచి ఆయుధాలు కొనడాన్ని ఇండియా క్రమంగా తగ్గిస్తూ వస్తోందన్నారు. 2016 నుంచి 2020 కాలంలో రష్యా నుంచి ఆయుధాల కొను గోలు 53% తగ్గిందన్నారు. అలాగే అమెరికా నుంచి ఆయుధాలను ఇండియా ఎక్కువగా కొంటోందని, 2020 ఆర్థిక సంవత్సరంలో ఆయుధాల కొనుగోలు రూ.25 వేల కోట్లకు చేరుకుందని తెలిపారు. పైగా వ్యాక్సిన్లు, డిఫెన్స్‌లో సహకారం, ఎనర్జీ స్ట్రాటజీ, టెక్నాలజీ మార్పిడి వంటి విషయాల్లో అమెరికాతో ఇండియా కలిసి నడుస్తోందని.. ఇలాంటి టైమ్‌లో ఆంక్షలు విధిస్తే సమస్యలు వస్తాయని చెప్పారు. ఇండో పసిఫిక్‌లో చైనాను ఎదుర్కోవడానికి కూడా ఇండియా సాయం ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. 2019లో చేసిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ప్రకారం నేషనల్ ఇంట్రస్ట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రెసిడెంట్ కాట్సా శాంక్షన్స్ నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని వార్నర్, కొర్నిన్చెప్పారు.
ఎందుకీ కాట్సా?
రష్యాకు చెందిన అత్యాధునిక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ఎస్400లను 5 యూనిట్లు కొనేందుకు రూ.37 వేల కోట్లకు 2018లో ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆ మిసైళ్లు కొంటే కాట్సా శాంక్షన్ విధిస్తామని ఇండియాను అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. రష్యా నుంచి ఎవరైనా ప్రధాన రక్షణ హార్డ్‌వేర్‌ను కొంటే ఆంక్షలు విధించేలా అమెరికా
కాట్సా చట్టం చేసింది.