రూల్స్ మార్చిన చైనా.. ఉన్నట్టుండి అమెరికా ఫ్లైట్‌‌‌‌ వెనక్కి

రూల్స్ మార్చిన చైనా.. ఉన్నట్టుండి అమెరికా ఫ్లైట్‌‌‌‌ వెనక్కి

బీజింగ్: షాంఘై ఎయిర్​పోర్టులో కరోనా రూల్స్​ను చైనా ప్రభుత్వం సడెన్​గా మార్చింది. దీంతో ఆ ఎయిర్​పోర్టులో దిగాల్సిన అమెరికా విమానం వెనక్కి వెళ్లింది. విమానం మార్గమధ్యలో ఉండగా రూల్స్ మార్చేయడంతో వాటిని అమలు చేయడం సాధ్యం కాదని ఫ్లైట్​ వాపస్​ తీసుకురావాల్సి వచ్చిందని డెల్టా ఎయిర్​లైన్స్ వెల్లడించింది. ఇటీవల జరిగిన ఈ ఘటన డెల్టా ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌తో సోమవారం వెలుగులోకి వచ్చింది.

షాంఘై వెళ్లాల్సిన ఫ్లైట్ సియాటిల్​ నుంచి షెడ్యూల్​ ప్రకారమే గాల్లోకి లేచిందని, దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణించిన తర్వాత కరోనా రూల్స్​మార్చినట్లు సమాచారం అందిందని డెల్టా ఎయిర్​లైన్స్ తెలిపింది. సియాటిల్​ నుంచి షాంఘైకి 11 గంటల ప్రయాణం కాగా.. అప్పటికే 6 గంటల ప్రయాణం పూర్తిచేసుకున్న ఫ్లైట్​మరో దారిలేక గాల్లోనే వెనక్కి తిరిగిందని చెప్పింది. అయితే మారిన రూల్స్‌‌‌‌ ఏమిటనేది స్పష్టంగా చెప్పలేదు. వచ్చే ఆరు వారాల్లో బీజింగ్‌‌‌‌లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో రూల్స్‌‌‌‌ను ఆ దేశం మరింత కఠినతరం చేసినట్టు తెలుస్తోంది. బీజింగ్‌‌‌‌కు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న జియాన్‌‌‌‌ సిటీలో వీకెండ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో 300 కంటే ఎక్కువ కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో 13 లక్షల మంది ఉంటున్న ఆ సిటీలో పూర్తిగా లాక్‌‌‌‌డౌన్ పెట్టారు. కాగా, డెల్టా ఎయిర్​లైన్స్ నిర్ణయంపై శాన్​ఫ్రాన్సిస్కోలోని చైనా ఎంబసీ అభ్యంతరం తెలిపింది. ఎయిర్​లైన్స్  తీరుపై నిరసన వ్యక్తం చేసింది.