బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన పవర్ స్టార్.. ఉస్తాద్ 20వ రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన పవర్ స్టార్.. ఉస్తాద్ 20వ రోజు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలే వేరు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన మరో చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. భారీ అంచనాలతో మార్చి 19, 2026న థియేటర్లలోకి అడుగుపెట్టింది. అయితే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలి వారం మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. మూడో వారం ముగిసేసరికి ఘోరంగా చతికిలపడింది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ గ్రాఫ్ చూస్తుంటే 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ రిపీట్ అవ్వలేదనేది స్పష్టమవుతోంది.

దారుణంగా వసూళ్లు .. 

విడుదలైన 20వ రోజు నాటికి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా వసూళ్లు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ ప్రకారం, 20వ రోజున ఈ చిత్రం కేవలం 16 లక్షల రూపాయల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఒక స్టార్ హీరో సినిమాకు, అది కూడా భారీ బడ్జెట్ చిత్రానికి నాలుగో వారంలోకి రాకముందే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.

వంద కోట్ల మార్కును  దాటేనా?

ఇప్పటివరకు సాధించిన లెక్కలు ప్రకారం ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్స్ రూ.71.98 కోట్లు కాగా ప్రపంచవ్యాప్త గ్రాస్ వసూళ్లు రూ.96.36 కోట్లు మేరకు రాబట్టింది.  భారతదేశంలో గ్రాస్ రూ.84.51 కోట్లు,  ఓవర్సీస్ వసూళ్లు రూ.11.85 కోట్లుగా ట్రెడ్ వర్గాలు అంచనా వేశాయి. వంద కోట్ల మార్కును అందుకోవడానికి కేవలం నాలుగు కోట్లు తక్కువలో ఉన్నా, ప్రస్తుతం థియేటర్ల వద్ద ఉన్న పరిస్థితి చూస్తుంటే ఆ మైలురాయిని చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

ఎక్కడ బెడిసికొట్టింది?

హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ మాస్ ఎనర్జీ సినిమాకు బలంగా నిలిచినప్పటికీ, కథనంలో లోపాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.  యాక్షన్ అదిరింది కానీ..: సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, ఛేజింగ్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అలరించాయి. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కొన్ని చోట్ల పవర్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ, మిగతా సినిమా అంతా సాదాసీదాగా సాగిందనే విమర్శలు వస్తున్నాయి.  

ALSO READ : బర్త్‌డే రోజున బ్లాస్టింగ్ అప్డేట్.. 

మిస్ ఫైర్ అయిన కెమిస్ట్రీ

సినిమాలో శ్రీలీల, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ట్రాక్ దారుణమైన విమర్శలను ఎదుర్కొంటోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం కుదరలేదని, ఆ సీన్లు చూస్తుంటే చాలా ఇబ్బందిగాఅనిపించిందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అంతే కాకుండా  ఈ సినిమా 2010 కాలం నాటి మేకింగ్‌ను తలపిస్తోందని, ప్రొడక్షన్ నరకం నుంచి బయటపడి 2026లో విడుదలైన సినిమా లాగా ఉందని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. రాశీ ఖన్నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం సినిమాకు మరో మైనస్ అని అభిప్రాయపడుతున్నారు.

త్వరలోనే ఓటిటిలో సందడి

థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి, పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల మొదటి రెండు వారాలు ఓ మోస్తరుగా నెట్టుకొచ్చిన 'ఉస్తాద్', కంటెంట్‌లో పట్టు లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఇక అందరి దృష్టి పవన్ తదుపరి ప్రాజెక్టుల పైనే ఉంది.