యూపీలో ఇకపై అక్కడ జాతీయ గీతం తప్పనిసరి

యూపీలో ఇకపై అక్కడ జాతీయ గీతం తప్పనిసరి

లక్నో : త్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ఉత‍్తర్వులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతిరోజూ తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీలకు మదర్సా విద్య అత్యంత కీలకమని, జాతీయ గీతం ఆలపిస్తే విద్యార్థులు సమాజ విలువలను నేర్చుకుంటారని యూపీ మంత్రి డానిష్ ఆజాద్ అన్నారు. 

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు. యూపీలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

 

 

యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేయడంపై MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ తమకు దేశభక్తి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దేశ స్వాతంత్యం పోరాటం జరుగుతున్న సమయంలో సంఘ్ పరివార్ లేదని, మదర్సాలు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా నిలిచాయన్నారు. 

మరిన్ని వార్తల కోసం.. 

రూ.100 కోట్ల భూమిని టీఆర్ఎస్ కు అప్పనంగ ఇచ్చిన్రు

తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 తలుపులు తెరవాలన్న పిటిషన్ కొట్టివేత