16 మందికి చేరిన ఉత్తరాఖండ్ ప్రమాద మృతులు

16 మందికి చేరిన ఉత్తరాఖండ్ ప్రమాద మృతులు

ఉత్తర్ ప్రదేశ్ లోని చమోలి జిల్లా జరిగిన ట్రాన్స్‌ఫార్మర్‌ పేలుడు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది. అలకనంద నది ఒడ్డున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను  ధృవీకరించిన చమోలీ ఎస్పీ పరమేంద్ర దోభాల్.. గాయపడిన వారికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ఈ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో పిపాల్‌కోటి ఔట్‌పోస్టు ఇన్‌చార్జి కూడా ఉన్నారని ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అశోక్ కుమార్ తెలిపారు. అలకనంద నది ఒడ్డున ఉన్న నమామి గంగే ప్రాజెక్ట్‌లోని మురుగునీటి శుద్ధి కర్మాగారంలో కరెంట్ ప్రవాహం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది గాయపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

విద్యుదాఘాతంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ముగ్గురు హోంగార్డులు సహా 16 మంది మృతి చెందినట్లు ఉత్తరాఖండ్‌ ఏడీజీ (లా అండ్‌ ఆర్డర్‌) వీ మురుగేశన్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.

#WATCH | Uttarakhand: 10 people died and several were injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval pic.twitter.com/QKC5vpvbF5

— ANI (@ANI) July 19, 2023

మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం

మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం వ్యక్తం చేశారు. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. "ఇది విచారకరమైన సంఘటన. జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఉన్నత కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలిస్తున్నారు" అని ముఖ్యమంత్రి ట్వీట్ ద్వారా తెలియజేశారు.

चमोली में करंट लगने से कई लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ। दुर्घटना में घायल हुए लोगों को उपचार हेतु नजदीकी अस्पताल भेज दिया गया है।

इस दुर्भाग्यपूर्ण घटना की मजिस्ट्रियल जांच के आदेश दे दिए हैं।

ईश्वर से दिवंगत आत्माओं की शांति एवं घायलों के शीघ्र…

— Pushkar Singh Dhami (@pushkardhami) July 19, 2023