హోంఐసోలేషన్ లోకి ఉత్తరాఖండ్ సీఎం

హోంఐసోలేషన్ లోకి ఉత్తరాఖండ్ సీఎం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హోంఐసోలేష్ లోకి వెళ్లారు. ఆయనకు కరోనా టెస్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ.. మూడు రోజుల పాటు హోంఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తాను, తన కుటుంబసభ్యులు, భద్రతా సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకున్నట్లు ఆయన తెలిపారు.

‘దేవుని దయ మరియు మీ ఆశీర్వాదాలతో నాకు కరోనా నెగిటివ్ గా వచ్చింది. నా దగ్గర స్పెషల్ డ్యూటీలో ఉన్న ఒక అధికారికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో నేను కూడా కరోనావైరస్ పరీక్ష చేయించుకున్నాను. ముందుజాగ్రత్తగా నేను రాబోయే మూడు రోజులు హోంఐసోలేషన్ లో ఉంటాను. నేను ఇంటి నుంచే టెలిఫోనిక్‌గా లేదా వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నా విధులను నిర్వర్తిస్తాను’ అని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

స్కాలర్‌షిప్ కు అప్లై చేయడానికి వెళ్లిన బాలికపై హత్యాచారం

పెన్షన్ తెచ్చుకోనీకిపోతె.. 92 మందికి కరోనా

ఒకే వ్యక్తికి మూడు నెలల్లో రెండోసారి కరోనా