కేదార్ నాథ్, యమునోత్రి యాత్రలలో రికార్డు వ్యాపారం

కేదార్ నాథ్, యమునోత్రి యాత్రలలో రికార్డు వ్యాపారం

ఈ ఏడాది కేదార్ నాథ్, యమునోత్రి యాత్రల ద్వారా సుమారు రూ.211 కోట్ల వ్యాపారం జరిగిందని గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ ఎండీ బన్సిధర్ తివారీ తెలిపారు. కేదార్ నాథ్ యాత్రలో గుర్రాలు, గాడిదలు, హెలికాప్టర్ సేవల ద్వారా భారీ ఆదాయం వచ్చిందన్నారు. కేవలం గుర్రాలు, హెలికాప్టర్ సర్వీసెస్ ల ద్వారానే దాదాపు రూ.211కోట్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. తొలిసారిగా కేదార్ నాథ్ ధామ్ లో గుర్రాల యజమానులు దాదాపు రూ.1 బిలియన్ 9 కోట్ల 28లక్షల రికార్డు వ్యాపారం చేశారని, దీని వల్ల ప్రభుత్వానికి కూడా రూ.8 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని స్పష్టం చేశారు. అయితే ఈ ఏడాది కేదార్ నాథ్ ను దర్శించుకునేందుకు సుమారు 5.34లక్షల మంది భక్తులు విచ్చేసినట్టు సమాచారం.

గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ హెలికాప్టర్ టిక్కెట్ల వల్ల బాగా లాభపడిందని బన్సిధర్ తివారీ చెప్పారు . హెలికాప్టర్ కంపెనీలు రూ.85 కోట్ల వ్యాపారం చేయగా, గుర్రపు సేవల ద్వారా రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేశాయి. యమునోత్రి, చార్ ధామ్ యాత్రలో గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ కు రూ.21 కోట్ల 75 లక్షల వ్యాపారం వచ్చినట్టు తివారీ స్పష్టం చేశారు. శీతాకాలం నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితమే కేదార్ నాథ్ ధామ్ ఆలయాన్ని మూసివేశారు. సంగీత వాయిద్యాలు, పూజలు, మంత్రోచ్చరణాలతో భక్తుల ఆనందోత్సాహాలతో ఆచారం ప్రకారం ఈ ప్రక్రియను నిర్వహించారు.