టీటీడీకి 'భవ్య' సంస్థల అధినేత రూ. కోటి విరాళం

V6 Velugu Posted on Jul 07, 2021

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్య అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనందప్రసాద్ రూ. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.  బుధవారం తిరుమలలో టీటీడీ దేవస్థానం అడిషనల్ ఈవో ధర్మారెడ్డిని కలిసిన ఆనందప్రసాద్, కృష్ణకుమారి దంపతులు కోటి రూపాయల చెక్కును అందజేశారు. టీటీడీకి గతంలోనూ ఆనందప్రసాద్ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ ట్రస్టుకు 2015లో ఆ మొత్తాన్ని అందజేశారు. ఆనంద ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ నగరంలోని భవ్య భవన సముదాయ ప్రాంగణాలలో  ఏడుకొండల వెంకటేశ్వరస్వామి దేవాలయలు కూడా నిర్మించిన సంగతి తెలిసిందే.
 

Tagged , tirupati today, tirumala today, V.Ananda Prasad donation, Bhavya group companies Chairman, Film producer Ananda Prasad, donates Rs 1 crore to, Ananda prasad donation to TTD

Latest Videos

Subscribe Now

More News