స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
  • వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
  • భాగ్యనగర్ తండాలో కాంగ్రెస్ లో చేరికలు

కారేపల్లి, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. మండలంలోని భాగ్యనగర్ తండాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 40 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పు స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా కొనసాగుతున్నాయని,  వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పనులను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసి చూపిస్తున్నారని చెప్పారు. 

కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు తలారి చంద్రప్రకాశ్, పగడాల మంజుల, బానోత్ దేవులా నాయక్, బానోతు రామ్మూర్తి, ఇమ్మడి తిరుపతిరావు, భద్రు నాయక్ ఈశ్వరిభాయి, భీముడు, హీరాలాల్, సక్రు, తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

మండలంలోని ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శాకాంబరి ఉత్సవాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాష్ శర్మ ఆధ్వర్యంలో కోట మైసమ్మ తల్లిని శాకాంబరిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభిరామారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వేణుగోపాలచార్యులు పాల్గొన్నారు.