తెలంగాణ బిడ్డకు పోలీస్ విశిష్ట సేవా మెడల్

తెలంగాణ బిడ్డకు  పోలీస్ విశిష్ట సేవా మెడల్

న్యూఢిల్లీ, వెలుగుః రాష్ట్రంలోని వనపర్తికి చెందిన ఉంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోటి రాముడికి ప్రతిష్టాత్మక పోలీస్ విశిష్ఠ సేవా మెడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ దక్కింది. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ డే 50వ వార్షికోత్సవంలో..లెఫ్ట్ నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన చేతుల మీదుగా రాముడు ఈ మెడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్  రాకేశ్​ ఆస్థాన తదితరులు పాల్గొన్నారు. రాముడు ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్)లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా డ్యూటీ చేస్తున్నారు. 1994 లో ఢిల్లీ పోలీస్ శాఖ లో కానిస్టేబుల్ చేరిన ఆయన.. అక్కడ కేసులను చేధించారు. 2013లో హైదరాబాద్, దిల్ సుఖ్​న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్​ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను పట్టుకునేందుకు క్రియాశీలకంగా పనిచేశారు. 2012 నుంచి 2017 వరకు డిప్యూటేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ లో ఎన్ఐఏ కానిస్టేబుల్​గా హైదరాబాదులో పనిచేశారు.