Varun Chakravarthy: కోహ్లీ, రోహిత్‌లను పక్కన పెట్టాడు: వరుణ్ చక్రవర్తి ఆల్ టైం బెస్ట్ టీ20 జట్టు ఇదే!

Varun Chakravarthy: కోహ్లీ, రోహిత్‌లను పక్కన పెట్టాడు: వరుణ్ చక్రవర్తి ఆల్ టైం బెస్ట్ టీ20 జట్టు ఇదే!

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 క్రికెట్ లో తన ఆల్ టైం ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ నిర్వహిస్తున్న 'కుట్టి స్టోరీస్ విత్ యాష్' అనే యూట్యూబ్ షోలో పాల్గొన్న ఈ భారత స్పిన్నర్.. టీ20 ఫార్మాట్ లో తన కలల జట్టును ఎంచుకున్నాడు. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వరల్డ్ అగ్ర శ్రేణి బ్యాటర్లను పక్కన పెట్టి మరీ తన ప్లేయింగ్ 11 ఎంచుకున్నాడు. తన ప్లేయింగ్ 11 లో ఐదుగురు బ్యాటర్లు.. ముగ్గురు ఆల్ రౌండర్లు.. ఇద్దరు పేసర్లు.. ఏకైక స్పిన్నర్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తి తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.  

ఓపెనర్లుగా ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు బట్లర్ తో సూపర్ ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ ను ఎంచుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్, నికోలస్ పూరన్, క్లాసన్ లను వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలకు సెలక్ట్ చేశాడు. ఫినిషింగ్ బాధ్యతలు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యతో పాటు విండీస్ వీరుడు రస్సెల్ కు అప్పగించాడు. ఎనిమిది, తొమ్మిది స్థానాలకు బ్యాటింగ్ చేయగల స్పిన్నర్లు నరైన్, రషీద్ ఖాన్ లకు తన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్లుగా టీమిండియా సంచలనం బుమ్రాతో పాటు శ్రీలంక యార్కర్ల వీరుడు మతీశ పతిరానాను తన ప్లేయింగ్ 11 లో చేర్చుకున్నాడు. 

►ALSO READ | Pakistan Cricket Board: 8 నెలలకే మార్చేశారు.. పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు కొత్త కోచ్

వరుణ్ చక్రవర్తి ప్రస్తుత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. ఇటీవలే టీ20 ఫార్మాట్ లో అద్భుతంగా రాణించిన వరుణ్.. ఇదే ఊపును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చూపించి టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఆగస్టు నెలలో భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 ఫార్మాట్ ఆడబోతుంది. ఈ సిరీస్ కు వరుణ్ చక్రవర్తి అందుబాటులో ఉంటాడు. ఐపీఎల్ ఆరు సీజన్ లు గా ఆడుతున్న ఈ తమిళనాడు స్పిన్నర్..ఓవరాల్ గా 100 వికెట్లు పడగొట్టాడు. 

టీ20 క్రికెట్‌లో వరుణ్ చక్రవర్తి డ్రీమ్ వరల్డ్ XI:

జోస్ బట్లర్, ట్రావిస్ హెడ్, సూర్యకుమార్ యాదవ్, నికోలస్ పూరన్, హెన్రిచ్ క్లాసెన్, హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మతీషా పతిరానా