విశ్వాసం : జనానికి అన్నీ ఇస్తే ఎంత వ్యతిరేకత వస్తుందో తెలియాలి.. వశిష్టుడు చెప్పిన 3 నియమాలు ఇవే..

విశ్వాసం : జనానికి అన్నీ ఇస్తే ఎంత వ్యతిరేకత వస్తుందో తెలియాలి.. వశిష్టుడు చెప్పిన 3 నియమాలు ఇవే..

పదహారవ శతాబ్దం ప్రబంధ యుగంగా సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. శ్రీకృష్ణదేవరాయలు కత్తి పట్టి యుద్ధం చేయటంతో పాటు, సంగీతసాహిత్యాలలోనూ ప్రతిభ కనపరిచి సాహితీసమరాంగణ చక్రవర్తిగా నిలిచాడు. ఆయన స్వయంగా కవి కావటం వలన ఆముక్తమాల్యద' ప్రబంధాన్ని రచించాడు. కావ్యమంతా విష్ణుభక్తులు కథలే. అలాగని ఇదేదో భక్తి ప్రబంధం అనుకుంటే పొరపాటు, యామున ప్రభువు నోటి వెంట రాజనీతిని బోధించాడు. 

ఒక ప్రభువుగా తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి అనుకుంటారు యామునాచార్యులు.. కుమారునికి రాజ్యభారం అపు చెప్తూ, తన జీవితా సుభవాలకు రాజధర్మాలను జోడించి, రాజనీతి బోధిస్తాడు. సుమారు ఆరు వందల ఏండ్ల క్రితం బోధించిన ఈ రాజనీతి నేటికీ ఆచరణీయం. సాధారణనీతికి, రాజనీతికి ఎంతో అంతరం ఉంటుంది. యామన ప్రభువు చేసిన రాజనీతిని అనుసరించి పరిపాలన చేయగలిగితే రామరాజ్యాన్ని స్థాపించినవారవుతారు. ఆముక్తమాల్యదలో ఇది యామున రాజనీతిగా ప్రసిద్ధి గాంచింది.

యామున ప్రభువు తన కుమారునితో "కుమారా! సువ్వు ఇప్పుడు రాజువయ్యావు. కనుక ప్రజారక్షణ నీకు పరమధర్మమైనది. రాజ్యాన్ని పరిపాలిస్తూ జీవితం గడుపుతుండాలి. అంతేకాని ఎవ్వరినీ విసుక్కోకూడదు. తమ కష్టాలు చెప్పుకోవటానికి వచ్చినప్పుడు వారి బాధలు విని, వారి కష్టాలను తీర్చాలి. వారి దుఃఖాన్ని పోగొట్టాలి" అని రాజు అనుసరించవలసిన మొదటి కర్తవ్యాన్ని బోధించాడు.'ప్రజ' అనే పదానికి 'సంతానం' అనేది నిఘంటువు చెప్పే అర్ధం. ప్రజారంజరంగా అంటే ప్రజలకు ఆనందం కలిగించేలా అంటే తన సంతానానికి సంతోషం కలిగేలా పరిపాలన సాగించాలి. 

అడవిలో జంతువులు సైతం వాటి ధర్మాన్ని అవి అనుసరిస్తాయి. అంతకుమించిన బాధ్యత ప్రజాపరిపాలకుడి మీద ఉంటుంది. రాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించాక, తప్పనిసరిగా కొన్ని ధర్మాలు అనుసరించాలి. ఆ ధర్మాన్నే 'రాజ ధర్మం' అంటారు రాజుగా పరిపాలన కొనసాగిస్తున్నంత. కాలం ప్రభువైనవాడు ఆ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. తన పరిపాలనలో ఉన్నవారి కష్టాలను ప్రభువులే తీర్చగలరు అన్యులకు చేసే అర్హత ఉండదు కనుక ప్రజాపరిపాలకుడు తన పరిపాలన సమయంలో ఎవ్వరి మీద చిరాకు పడకూడదు. సమస్యలు.. చెప్పుకోవటానికి వచ్చిన ప్రజల మాటలను శ్రద్దగా విని, సహృదయంతో పరిష్కరించాలి..

ఇక్కడ మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి త్రేతాయుగంలో అంటే రామాయణ కాలంలో రాముడికి పట్టాభిషేకం స్థిరమయ్యాక, వశిష్ఠుల వారు రాముడిని పిలిచి "నాయనా రాజు కాబోయే.. వాడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజు రాత్రి నువ్వు ఉపవాసం ఉండాలి. నేల మీద పడుకోవాలి. బందువులతోను, సన్నిహితులతోను మాట్లాడకూడదు. తెల్లవారితే పట్టాభిషేకం" అని చెప్తారు. ఇందులో ఎంతో అంతరార్థం ఉంది.

నేల మీద నిద్రించే సామాన్యుల గురించి రాజుకి తెలియాలి. ఆకలి బాధ ఎంత దుర్భరమైనదో పరిపాలకుడికి తెలియాలి. సన్నిహితులకు బంధువులకు... ప్రీతితో అన్నీ కట్టబెడితే ప్రజలకు ఆన్యాయం చేయటమే కాకుండా.. వారి నుంచి ఎంత వ్యతిరేకత వస్తుందో తెలియాలి. అందుకే మూడు నియమాల గురించి వశిష్టుడు చెప్పాడు. అచే అందాన్ని కొంచెం విపులంగా యామున ప్రభువు వివరించాడు. 

ఒక రాజ్యంలో ప్రజలు తమకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్పమని రాజును వేడుకోవటం సహజం రాజు తన స్వప్రయోజనాల కోసం ప్రజల పరిరక్షణను పక్కకు తోసేస్తే, ప్రజలలో సహనం నశించి, తిరుగుబాటు వస్తుంది. అది రాజుకి మంచిది కాదు. ప్రజల శ్రేయస్సీ పరిపాలకుడి ప్రథమ కర్తవ్యం. ప్రభువు సంరక్షణ ప్రజల కర్తవ్యం.. ప్రజలను కన్నబిడ్డలుగా భావించాలి. 'త్యాగాయ సంభృతార్థానాం..' అంటే 'సంపాదించినదంతా ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేసేవారని రఘువంశీయుడైన దిలీప మహారాజు గురించి కాళిదాసు 'రఘువంశం' కావ్యలలో వర్ణిస్తాడు.

రఘు మహారాజు కాలంలో పరతంతు అనే గురువు దగ్గర కౌత్సుడు అనే శిష్యుడు ఉండేవాడు. గురుదక్షిణ చెల్లించటం కోసం 14 కోట్ల బంగారు నాణాలను ఇవ్వమని రఘు మహారాజును కోరుకుంటాడు. అప్పటికే ఆయన అనేక దానాలు చేసి ఉంచటంతో, ఆయన దగ్గర మట్టి పాత్ర మాత్రమే మిగులుతుంది. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి సాయం చేయటం ప్రభువుల ప్రథమ కర్తవ్యం కనుక, రఘుమహారాజు కొంత సేపు ఆలోచిస్తాడు. 

తక్షణమే కుబేరుడి మీద యుద్ధం ప్రకటిస్తాడు. కుబేరుడు పరుగుపరుగున వచ్చి, రఘు మహారాజుయ అడిగి, విషయం తెలుసుకుని. బంగారు వర్షం కురిపిస్తాడు. కౌత్సుడు తనకు కావలసిన 14 కోట్ల బంగారు నాణాలు సంచుల్లోకి తీసుకుని, మిగిలిన బంగారమంతా ప్రజా రక్షణకు వినియోగించమని రఘుమహారాజుకి అందిస్తాడు. రఘుమహారాజులోని నిజాయితీ తెలుసు కనుకనే మహారుడు తన కర్తవ్యాన్ని తెలుసుకున్నాడు.

ప్రజా పరిపాలకుడు ప్రజలను పీడించి వారి నుండి డబ్బులు వసూలు చేయకూడదు. నిష్కామంగా పరిపాలన చేసిన ప్రభువుకి ప్రజల నుంచి సహకారం ఉంటుందని, అవసరంలో ఇదుకుంటారని చెప్పటానికి ఈ కథ పెద్ద ఉదాహరణ. తన దగ్గర మట్టి పాత్ర మాత్రమే ఉంచుకున్న ప్రభువు ఆయన. కాని తన దగ్గరకు సాయం అర్థించి వచ్చివానికి లేదనకుండా, సంపన్నుడైన కుబేరుడి దగ్గర నుంచి డబ్బు తీసుకువచ్చి, కౌత్సుడికి అందించి, ప్రజా పరిపాలకుడు అనిపించుకున్నాడు. "ఇదీ ప్రభువులు ఆచరించవలసిన పరిపాలనా విధానం ప్రభువులు అమనిత్యం ప్రజల సంరక్షణ కోసమే జీవించాలని యామున ప్రభువు చెప్పిన రాజనీతి.