Vastu Tips : మన ఇంట్లో బరువైన వస్తువులు ఎక్కడెక్కడ ఉండొచ్చు..?

Vastu Tips : మన ఇంట్లో బరువైన వస్తువులు ఎక్కడెక్కడ ఉండొచ్చు..?

బరువులు నైరుతి మూలనే ఉండాలంటారని పడకగదిలో ఆ మూలన బీరువా పెట్టాం. అయితే వాషింగ్ మెషిన్ లాంటి బరువైన వస్తువులను ఎక్కడ పెట్టాలి? ప్రస్తుతం దాన్ని హాల్లో ఈశాన్యంలో ఉన్న బియ్యం బస్తాల పక్కనే పెడుతున్నా. ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరూ... 'హాల్లో ఎందుకుపెట్టారు. మంచిది కాదు' అంటున్నారు. బరువులను నైరుతిలో కాకుండా ఇంకెక్కడెక్కడ పెట్టొచ్చు?

బరువైన బీరువా, బియ్యం బస్తాలు వంటివి నైరుతి మూల పెట్టడమే మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం అక్కడ బరువులు ఉండాలి. అయితే వాషింగ్ మెషిన్ కూడా బరువైన వస్తువే. కాబట్టి దాన్ని కూడా నైరుతిలో పెట్టాలి. హాల్లో నైరుతి మూలన పెట్టుకోవచ్చు. హాల్లో ఖాళీ లేదు అనుకుంటే, మధ్య దక్షిణ, మధ్య పడమరలో పెట్టుకోవచ్చు. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు.