Vastu Tips : ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి..?

Vastu Tips : ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి..?

ప్రస్తుతం మేము ఉంటున్నది అద్దె ఇల్లు. ఆ ఇంట్లోకి దిగి రెండేళ్లైంది. మొదట బాగానే ఉన్నా, ఇప్పుడు చిన్నచిన్న ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. అయితే మా ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరూ మీ బాత్రూమ్ నైరుతిలో ఉందేంటి? అక్కడ ఉండొద్దు కదా? అంటున్నారు. అది నిజమేనా? అందుకే మాకు ఇబ్బందులు వస్తున్నాయా? అసలు బాత్రూమ్ ఏ మూల ఉండాలి?

బాత్రూమ్ ఎక్కడుండాలన్న విషయంలో ఎప్పుడూ సందేహాలు ఉంటూనే ఉంటాయి. వాయువ్యం, ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే మంచి జరుగుతుంది. నైరుతిలో గొయ్యి ఉండకూడదు. అందుకే బాత్రూమ్ ఆ మూల ఉంటే అన్ని రకాల సమస్యలూ వస్తాయి. మరోముఖ్యం విషయం, మెట్ల కింద మాత్రం బాత్రూమ్ ఉండొద్దు. కానీ చాలామంది ఫస్ట్ ఫ్లోరికి వెళ్లడానికి కట్టే మెట్ల కింద, జాగా కలిసొస్తుందని కడతారు. బాత్రూమ్లో గుంట, నీళ్లు ఉంటాయి. కాబట్టి వాటిపై నుంచి నడవకూడదు. అది అన్నివిధాలా అరిష్టమే.