ఫ్యాన్సీ కష్టాలు.. వెహికల్ నంబర్ కు ఆన్‌‌‌‌లైన్ ఇక్కట్లు.. బిడ్డింగ్ సమయంలో సరిగా పనిచేయని వాహన్ పోర్టల్

ఫ్యాన్సీ కష్టాలు.. వెహికల్ నంబర్ కు ఆన్‌‌‌‌లైన్ ఇక్కట్లు.. బిడ్డింగ్ సమయంలో సరిగా పనిచేయని వాహన్ పోర్టల్
  • డేటా ఎర్రర్‌‌‌‌‌‌‌‌ తో ఫ్యాన్సీ నంబర్లు కోల్పోతున్న ఆశావహులు 
  • ఫ్యాన్సీ నంబర్ రాకున్నా రిజిస్ట్రేషన్ ఫీజులో 10 శాతం కట్ చేసుకుంటున్న రవాణశాఖ
  • బైక్, కారు పర్మినెంట్ నంబర్లు రావడానికి కూడా 15 రోజుల నుంచి రెండు నెలల టైమ్​

 
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫ్యాన్సీ స్పెషల్ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం పోటీపడే వాహనదారులకు వాహన్ పోర్టల్ చుక్కలు చూపిస్తోంది. కీలకమైన ఆన్‌‌‌‌లైన్ వేలం ఈ బిడ్డింగ్ ప్రక్రియ ప్రతి రోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు  జరుగుతుంది. ఆ సమయానికి జాతీయ సర్వర్ వాహన్ పోర్టల్ తీవ్రమైన లోడ్‌‌‌‌తో స్తంభించిపోతోంది. 

పేజీలు ఓపెన్ కాకపోవడం, రేట్లు పెంచే ఆప్షన్స్ లోడ్ అవ్వకపోవడంతో కస్టమర్లు తమకు నచ్చిన లక్కీ నంబర్లను వేలంలో దక్కించుకోలేకపోతున్నారు. దీంతో ఇటీవల చాలా మంది తమకు కావాల్సిన నంబర్లను బిడ్డింగ్ లో కొనలేక కోల్పోయారు.  

నంబర్​ దక్కకపోయినా ఫీజులో 10 శాతం కట్ 

ఫ్యాన్సీ నంబర్ల కోసం ఈ-యాక్షన్ ప్రక్రియలో పాల్గొని, దక్కించుకోలేకపోయినా లేదా బిడ్డింగ్‌‌‌‌లో ఓడిపోయినవారికి రీఫండ్​లో 10 శాతం మొత్తాన్ని కట్ చేసుకుంటున్నారు. గతంలో ఈ నిబంధన ఉండేది కాదు. మొత్తం అమౌంట్ చెల్లించేవారు.  అత్యధిక డిమాండ్ ఉన్న ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్ ఫీజులు కూడా ఇప్పుడు భారీగా పెరిగాయి. 9999 నంబర్‌‌‌‌కు గతంలో రూ. 50 వేలు ఉండగా.. రూ. 1.50 లక్షలకు పెంచారు. 0009, 0001 నంబర్‌‌‌‌కు రూ.50 వేలు ఉంటే రూ.లక్షకు పెంచారు. 6666 నంబర్‌‌‌‌కు గతంలో రూ. 30 వేలు ఉండగా.. రూ.లక్షకు పెంచారు.

 ఫ్యాన్సీ నంబర్లు కాకుండా ఆ రోజు సిరీస్ లో ఉన్న నంబర్ ను కేవలం రూ.వెయ్యి కట్టి తత్కాల్ పద్ధతిలో తీసుకునే వీలు ఉండేది. కానీ ఇప్పుడు ఆ రూల్ ను పూర్తిగా మార్చేశారు. కారుకు రూ.6 వేలు, బైక్ కు రూ.3 వేలు కట్టాలి. ఒకవేళ నార్మల్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నా.. దానికి ఎవరైనా పోటీకి వస్తే దానికోసం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఆన్ లైన్ యాక్షన్ లో పాల్గొనాల్సి 
ఉంటుంది.

ఆధార్ ‘డేటా మిస్‌‌‌‌ మ్యాచ్’ తో ఇక్కట్లు.. 

తెలంగాణ రవాణా శాఖను డిజిటలైజ్ చేసి, సేవలను మరింత సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ వాహన్ 4.0 సాఫ్ట్‌‌‌‌వేర్ వాహనదారుల పాలిట శాపంగా మారింది. రాష్ట్ర రవాణా వ్యవస్థను జాతీయ పోర్టల్‌‌‌‌కు అనుసంధానించినప్పటి నుంచి టెక్నికల్ సమస్యలు వస్తూనే ఉన్నాయి. 

సర్వర్ డౌన్, డేటా సరిగా చూపకపోవడం వంటి సమస్యల వల్ల.. లక్షలు పెట్టి వాహనాలు కొన్నా  శాశ్వత నంబర్ ప్లేట్ ఎప్పుడు వస్తుందో తెలియక వేలాది మంది కస్టమర్లు డీలర్లు, ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. డేటా సింక్ వాలిడేషన్ కారణంగా సమస్యలు ఏర్పడుతున్నాయి. కొత్త కారు లేదా బైక్ కొన్నప్పుడు షోరూమ్ వారు ఎంటర్ చేసే వాహనదారుడి వివరాలు.. వారి ఆధార్ కార్డ్, వెహికల్ ఇన్సూరెన్స్ పత్రాల్లోని వివరాలు రిజిస్ట్రేషన్​సమయంలో వంద శాతం మ్యాచ్ అవ్వాలి. 

అక్షరం మార్పు, ఇంటిపేరు, స్పేస్‌‌‌‌లలో తేడా ఉన్నా ఆ అప్లికేషన్‌‌‌‌ను సాఫ్ట్‌‌‌‌వేర్ తిరస్కరిస్తోంది. దీంతో వందలాది మంది అప్లికేషన్లు హోల్డ్‌‌‌‌లో పడిపోతున్నాయి. ఆధార్ అప్ డేట్ చేయించుకుని పర్మినెంట్ నంబర్ రావడానికి కొందరికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. డీలర్లు మాత్రం తమ చేతిలో ఏమీ లేదని వాహన్ పోర్టల్, ఆర్టీవో ఆఫీసులో ఆలస్యమే కారణమని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చెందిన ఓ వ్యక్తి ఫ్యాన్సీ నంబర్ కోసం ట్రై చేశాడు. ఇందుకు 16 రోజుల పాటు వెయిట్ చేసినప్పటికీ ఆ నంబర్ రాకపోవడంతో సాధారణ నంబర్ తో సరిపెట్టుకున్నాడు.

పేమెంట్ టైమ్అవుట్స్

నంబర్ బుకింగ్ లేదా ఫ్యాన్సీ నంబర్ రిజర్వేషన్ కోసం ఆన్‌‌‌‌లైన్ గేట్‌‌‌‌వే ద్వారా వేల రూపాయల ఫీజు చెల్లించేటప్పుడు విపరీతమైన బ్యాంకింగ్ ఎర్రర్స్ వస్తున్నాయి. వాహనదారుడి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నప్పటికీ.. వాహన్ పోర్టల్ స్క్రీన్‌‌‌‌పై మాత్రం పెండింగ్ లేదా ఫెయిల్డ్ అని చూపిస్తోంది. ఈ లోపం సరిదిద్దేలోపు వేలం సమయం ముగిసిపోతుండటంతో కస్టమర్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. 

బిడ్డింగ్‌‌‌‌లో గెలిస్తే, ఆ విషయాన్ని తెలియజేస్తూ మెసేజ్ వస్తుంది. యాక్షన్ ముగిసిన తర్వాత 5 రోజుల్లోగా మిగిలిన బ్యాలెన్స్ మొత్తాన్ని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పూర్తిగా చెల్లించాలి. డబ్బులు చెల్లించిన వెంటనే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అలాట్‌‌‌‌మెంట్ లెటర్ జనరేట్ అవుతుంది. ఇది కేవలం 90 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ గడువులోగా ఆ షోరూమ్ బైక్ లేదా కారును ఆర్టీఏ ఆఫీస్‌‌‌‌లో ప్రదర్శించి, ఆ ఫ్యాన్సీ నంబర్‌‌‌‌తో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పీఆర్‌‌‌‌‌‌‌‌ పూర్తిచేసుకోవాలి. లేకపోతే నంబర్ రద్దవుతుంది. ఈ ప్రక్రియ వాహనదారులకు తలనొప్పిగా మారింది.