వెహికల్​ నెంబర్​ ప్లేట్స్ కు​ ఇన్ని రంగులు ఎందుకో తెలుసా...

వెహికల్​ నెంబర్​ ప్లేట్స్ కు​ ఇన్ని రంగులు ఎందుకో తెలుసా...

మనం ఏ వాహనం కొన్నా, చట్ట ప్రకారం దానికి రిజిస్ట్రేషన్ చేయించాలి. సంబంధిత అధికారులు వెహికల్‌కు ఒక నంబర్ కేటాయిస్తారు. అది స్పష్టంగా కనిపించేలా నంబర్ ప్లేట్ వేయించుకోవాలి. అయితే భారతదేశంలో వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్​ ప్లేట్లు చాలా  రంగుల్లో ఉంటాయి రోడ్లపై తెలుపు, పసుపు లేదా ఎరుపు నంబర్ ప్లేట్లు ఉన్న కార్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ కలర్ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఉంటాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో బ్లూ కలర్ రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఉన్న కార్లు సైతం కనిపిస్తాయి. ఎవరు ఉపయోగించే వాహనాలకు ఏ రంగు రిజిస్ట్రేషన్  నంబర్​ ప్లేట్లు  ఉపయోగిస్తారో తెలుసుకుందాం. . .

 ఇండియన్ ఎంబ్లెమ్ ఉండే రెడ్ నంబర్ ప్లేట్లు: భారత ప్రభుత్వ చిహ్నం ఉండే ఎరుపు రంగు నంబర్ ప్లేట్లను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వాహనాలకు ఉపయోగిస్తారు. వీటిని ఉన్నత స్థాయి అధికారులు, ప్రముఖులు వాడుతారు.

రెడ్ నంబర్ ప్లేట్లు: ఎరుపు నంబర్ ప్లేట్లు టెంపరరీ వెహికల్స్‌కు ఉంటాయి. వీటిని టెస్టింగ్ కోసం వాడతారు. అధికారికంగా రిజిస్ట్రేషన్ కాని వాహనాలకు వీటిని కేటాయిస్తారు.

బాణం గుర్తు ఉన్న నంబర్ ప్లేట్లు: కొన్ని వెహికల్స్ నంబర్ ప్లేట్లపై పైకి వెళ్తున్న బాణం గుర్తు (Upward-Pointing Arrow) ఉంటుంది. ఇవి సైన్యం,  ఆర్మీ.. నేవీ  సాయుధ దళాలకు చెందిన వాహనాలకు ఉంటుంది.  వీటిని రక్షణ శాఖ జారీ చేస్తుంది. ఈ ప్లేట్లు ఉన్న వెహికల్స్‌కు ట్రాఫిక్ రూల్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. స్పెషల్ లేన్స్ లేదా రూట్లకు యాక్సెస్ మంజూరు చేస్తారు.

 బ్లూ నంబర్ ప్లేట్లు: విదేశీ దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్లకు చెందిన వాహనాలకు బ్లూ నంబర్ ప్లేట్లు ఉంటాయి. వీటిని విదేశాంగ శాఖ జారీ చేస్తుంది. దౌత్యవేత్త దేశ లోగో లేదా చిహ్నంతో పాటు తెలుపు అక్షరాలు, సంఖ్యలు వీటిపై ఉంటాయి.

 వైట్ నంబర్ ప్లేట్: వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఎక్కువగా తెలుపు రంగులోనే కనిపిస్తాయి. ఇవి నాన్-కమర్షియల్ ప్రైవేట్ వెహికల్స్‌కు ఉంటాయి. ఈ ప్లేట్లపై రాసే అక్షరాలు రాష్ట్ర కోడ్, జిల్లా కోడ్, వాహన యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సూచిస్తాయి.

 పసుపు రంగు నంబర్ ప్లేట్లు: టాక్సీలు, బస్సులు, ట్రక్కులు వంటి కమర్షియల్ వెహికల్స్ నంబర్ ప్లేట్లు పసుపు రంగులో ఉంటాయి. వీటిపై అక్షరాలు, సంఖ్యలు నలుపు రంగుతో రాస్తారు. వీటిపై వైట్ ప్లేట్స్ మాదిరిగానే రాష్ట్రం, జిల్లా కోడ్‌ను సూచించే ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. 

 బ్లాక్ నంబర్ ప్లేట్లు: బ్లాక్ నంబర్ ప్లేట్లు సెల్ఫ్ డ్రివెన్ రెంటర్ కమర్షియల్ వెహికల్స్‌కు ఉంటాయి. వీటిని వాణిజ్య అవసరాల కోసమే ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ వాహనాలు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

 గ్రీన్ నంబర్ ప్లేట్లు:  ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లు కేటాయిస్తారు. వాహనం రకంతో సంబంధం లేకుండా, అన్ని ఈవీలకు ఈ రంగు రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఉంటాయి. వీటిపై అక్షరాలు, కోడ్ తెలుపు రంగులో ఉంటాయి.